జుక్కల్ మండల్ ప్రతినిధి / క్రిందిదొడ్డి నాగరాజ్
జుక్కల్ న్యూస్;
అభివృద్ధికి నోచుకోని బిచ్కుంద బస్ స్టేషన్. నిత్యం వేల మంది ప్రయాణికులతో కిటకిటలాడే బస్టాండ్ ఇది. ఇక్కడ బిచ్కుంద చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రయాణికులు తరచుగా వస్తూ వెళుతూ ఉంటారు. అలాంటి ఈ బస్టాండ్లో కనీస సౌకర్యాలు కూడా లేవు. శిథిలావస్థకు ఈ బస్టాండ్ చేరుకున్నది. ఇక్కడ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గత 15 సంవత్సరాల నుండి పట్టించుకోకపోవడంతో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ ముఖ్యంగా మహిళలకు మూత్రశాలలు సరియైన పద్ధతిలో లేవు. ఈ ప్రాంతం మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది కావున ఇక్కడ అభివృద్ధికి మరింత ఎక్కువ అవకాశం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఉన్న నాయకులు మాత్రం అవి ఏవి పట్టించుకోవడం లేదు. ఇది నిత్యం ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంది అని ప్రయాణికులు వాపోయారు.


Post A Comment: