ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

మిషన్ 29  కార్యక్రమం ద్వారా అర్బన్ ఏరియా లో వోటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలి అని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సీక్త పట్నాయక్ ఆదేశించారు. 

సోమవారం కలెక్టర్ తన ఛాంబర్ లో  స్వీప్ కార్యక్రమం, ఎంసి ఎంసి  పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 100 శాతం ఓటింగ్‌ లక్ష్యంతో అధికారులు పని చేయాలని ఆదేశించారు. అధికారులు అందరూ ప్రజలకు ఓటు చైతన్యవంతులుగా తయారు చేయాలి అన్నారు.

 ఓటర్లకు నవంబర్‌ 10 నుంచి 25తేదీ వరకు ఓటరు గుర్తింపు స్లీప్‌లు అందజేస్తామని తెలిపారు

ఓటింగ్‌ రహస్య పద్ధ్దతిలో జరుగుతుందని తెలియజేశారు. జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లో ఓటరు చైతన్య రథం ద్వారా ప్రచారం చేస్తున్నదని, 100 శాతం ఓటింగ్‌ లక్ష్యం గా ప్రచారం చేస్తుందని తెలిపారు. ఓటరు చైతన్య రథం జిల్లాలో ప్రధాన కూడళ్లు, మార్కెట్స్‌, బస్‌ స్టాండ్‌ లు, జాతరలు, షాపింగ్‌ మాల్స్‌, కాలనీల్లో ప్రచారం చేస్తుందని, కళాకారులు ఆట పాటలతో ప్రజలకు చైతన్యం కల్గించాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఏదైనా ఫిర్యాదులు ఉంటే సి విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని, కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1950కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని డబ్బు, మద్యం, ఏదైనా వస్తువుల పంపిణీ జరిగినా నేరు గా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలియజేశారు. ఈరోజు వరకు టోల్ ఫ్రీ నంబర్ 1950 లో మొత్తం 40 కేసులు నమోదు అవ్వగా సి - విజిల్ లో ఈ నాటికి 54 కేసులు నమోదు చేయడం జరిగింది అని అందులో 11 కేసులు పరిష్కారం చేయడం జరిగింది అని అన్నారు.

ఎంసిఎంసి సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం, సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనల వంటి వాటి పై తక్షణమే స్పందించడం జరుగుతుందని లోకల్ ఛానెల్స్ లో వచ్చే వార్తలను పూర్తిస్థాయిలో రికార్డు చేయాలని సూచించారు. వార్తా పత్రికలు, ఈ-పేపర్‌లు, టెలివిజన్ ఛానెల్‌లు, స్థానిక కేబుల్ నెట్‌వర్క్ లు, సోషల్ మీడియా, సంక్షిప్త సందేశాలు, ఇతర ఆడియో-వీడియో విజువల్ మీడియాలతో సహా ప్రకటనలను ఎంసిఎంసి నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

 ఎన్నికల నిర్వహించే సమయంలో సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు ఇతర ప్రాంతాలో జరిగిన వీడియోలు ఇక్కడ జరిగినట్లు ప్రచారం చేయడం, పాత వీడియోలను ప్రచారం చేయడం, ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా అసత్యాలు వదంతులు ప్రచారం చేస్తే  చర్యలు తీసుకోవడం జరుగుతుందని  మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటి (యం.సి.యం.సి) పర్యవేక్షిస్తునదని కలెక్టర్  తెలిపారు.  సోషల్ మీడియా లలో తప్పుడు సమాచారం  వ్యాప్తి చెందకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొంత మంది ప్రింటర్లు  ఎంసిఎంసీ అనుమతి లేకుండా ప్రింటర్స్ పోస్టర్లు, పంప్లెట్స్ ముద్రిస్తున్నరాని, తప్పనిసరిగా కమిటీ అనుమతి తీసుకోవాలి అని అన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: