పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న,,,
పెద్దపల్లి:సెప్టెంబర్:23:పేదల జీవితాల్లో వెలుగు నింపేలా ప్రణాళిక..గొప్ప ఆలోచనతో సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తుండు గడపగడపకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించీ,ఎమ్మెల్యేగా మళ్లీ చందర్ ను గెలిపించుకోవాలే,రాష్ట్రంలోని ప్రతిపేద కుటుంబానికి మేలు జరిగేలా బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనీఫెస్టోకు రూపకల్పన చేశారని రామగుండం హనుమాన్ నగర్ పట్టణ అధ్యక్షులు మండలరమేష్ గౌడ్ గారు రామగుండం నగరపాలక సంస్థ28వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపూరి పులేందర్ అన్నారు.విజయదశమి పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రూపకల్పన చేసిన మేనిఫెస్టోకు విజయం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ ఆ డివిజన్ పరిధిలోని దుర్గామాత మండపంలో సోమవారం ప్రత్యేక పూజలుచేశారు.అనంతరం ఇంటింటామానీఫేస్టోపై అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడారు,గతంలో ఎన్నికల మేనీఫెస్టోలో పొందుపర్చని అనేక పథకాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ అమలు చేశారని ఆయన గుర్తుచేశారు.ప్రజాసంక్షేమం కోసం ప్రజలకు ఉపయోగపడే రీతిలో గొప్పగా ఆలోచన చేసే సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.ఎన్నికలు వస్తున్నాయంటేనే పథకాలు,హమీలు ఇచ్చే సంస్కృతి బీఆర్‌ఎస్ పార్టీకి లేదన్నారు.కళ్యాణలక్ష్మి, రైతుబంధు,రైతుబీమా,24గంటల కరెంటు, పించన్‌లతో పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.ఎవరూ ఊహించని రీతిలో పథకాలకు రూపకల్పన చేసి ప్రవేశపెట్టడం కేసీఆర్‌కే సాధ్యమవుతుందన్నారు,ఈసారి కొత్త పథకాలలో సౌభాగ్య లక్ష్మి,కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పథకాలు 90 లక్షల మంది జీవితాలకు భరోసాగా నిలుస్తున్నాయన్నారు,రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్,రామగుండంలో ఎమ్మెల్యేగా కోరు కంటి చందర్ ఉంటేనే అభివృధ్ది,సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.నాలుగేండ్ల కాలంలోనే అనేక సేవా కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ ఫలాలను అందించారని ఆయన గుర్తు చేశారు.ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ప్రతీ కార్యకర్త, నాయకులు సమిష్టిగా పని చేయాలని,బీఆర్‌ఎస్ ఎన్నికల మేనీఫేస్టోను గడప గడపకు తీసుకువెళ్లి అవగాహన కల్పించాన్నారు.ఎమ్మెల్యేగా చందర్ ను బారీ మెజార్టీతో గెలిపించుకుని రామగుండం గడ్డపై గులాబీ జెండా ఎగరవేయలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నంది నాగేష్,కే.పి కుమార్,పల్లె ప్రభాకర్,గోటే ట్టపల్లి దుర్గాప్రసాద్,మైస రమేష్,రాజయ్య,కొండ సురేష్,జక్కుల ప్రేమ్ కుమార్,ఎండి మున్వర్ పాయిల మాలిక్,మేకల శ్రీనివాస్,పల్లెసారయ్య,గాజుల బాలకృష్ణ,గుడిసె గణేష్,గాజుల శంకర్,కొమ్ము ప్రసాద్,కొమ్ము ప్రణీత్.పల్లె ప్రశాంత్ పాల్గొనడం జరిగింది.

Post A Comment: