ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;సద్దుల బతుకమ్మ సందర్భంగా చిన్నవడ్డేపల్లి చెరువు కట్ట వద్ద జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొని అడపడుచులతో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
బతుకమ్మ పండుగ మన తెలంగాణ ఆడపడుచుల పండగని తీరొక్క పువ్వులను అందంగా పేర్చి బతుకమ్మ పండుగ జరుపుకోవడమే కాకుండా ఆ పువ్వులనే దేవుళ్లుగా పూజించే గొప్ప సంస్కృతి సంప్రదాయం మన తెలంగాణ స్వంతమన్నారు
తెలంగాణ సిద్దించిన తరువాత బతుకమ్మ వేడుకలను సగౌరవంగా జరుపుకుంటున్నామన్నారు
ఆ భవంతుని ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు,నా నియోజకవర్గ ఆడపడుచులు సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఎమ్మెల్యే కోరుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ సురేష్ జోషి,డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు ఉన్నారు.

Post A Comment: