ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వచ్చేసిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సివిల్ పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులకు పోలీసు సిబ్బందికి సహాయంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు వచ్చేశాయి. ఇవి తొలి విడత బలగాలు కాగా త్వరలో మరిన్ని కేంద్ర బలగాలు రానున్నాయి. భూపాలపల్లి సబ్ డివిజన్ పోలీసులతో ఆదివారం పారామిలటరీ బలగాలు భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించాయి.
ఈ సందర్భంగా డిఎస్పీ రాములు మాట్లాడుతూ , అసెంబ్లీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పాత నేరస్తులను ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా బైండోవర్ చేస్తున్నామని అన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అన్నారు. ప్రజా స్వామ్యం లో ఓటే అయుధమని ప్రతి ఒక్కరూ ఓటువేయాలన్నారు.

Post A Comment: