మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గోదావరిఖని-: హథ్ సే హథ్ జోడో యాత్రలో(For Change) భాగంగా కార్పొరేటర్ ఎండీ ముస్తఫా  ఆధ్వర్యంలో స్థానిక 44వ డివిజన్, &  32వ డివిజన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  పాల్గొని ఇంటింటికి వెళ్లి ఆత్మీయంగా  పలుకరిస్తూ,

ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు..ఈ సందర్బంగా రాజ్ ఠాకూర్  మాట్లాడుతూ.. 

వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థలం ఉన్న ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు సాయం అందిస్తామని, వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ప్రతీ రైతుకు రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తాం. కౌలు రైతులకు, రైతు కూలీలకు, భూమిలేని వారికి రూ. 15 వేల సాయం అందిస్తాం.  పేదలకు వైద్యం అందించేందుకు 2 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ మార్జిన్ ను 5లక్షలకు పెంచుతాం. పేదల కోసం రూ. 500 లకే సిలిండర్ అందిస్తాం. పోడు భూములకు పట్టాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందాని తెలిపారు.

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, ఫీజు రియంబర్స్మెంట్, ఇంటికో ఉద్యోగం ఇలా అనేక హామీలు ఇచ్చి గెలిచి గద్దెనెక్కినంక హామీలు తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. 

ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  50డివిజన్ల కో ఆర్డినేటర్లు కాల్వ లింగస్వామి, మాదరబోయిన రవి కుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్ మహంకాళీ స్వామి, సీనియర్ నాయకులు బొంతల లచ్చన్న,నాయిని ఓదెలు,పిసిసి సెక్రటరీ పెడ్డెల్లి ప్రకాష్, మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్, పూసాల శ్రీనివాస్, బీసీ విభాగం నాయకులు పెండ్యాల మహేష్,గట్ల రమేష్, ఎస్సీ సెల్ అద్యక్షులు తాల్లపెళ్లి యుగేందర్, పంజా శ్రీనివాస్, మైనారిటీ అధ్యక్షులు నజీమొద్దిన్, తిప్పారపు శ్రీనివాస్, పీక అరుణ్, రాపెల్లి కార్తీక్, మిడిధొడ్డి ప్రవీణ్, మెంటం ఉదయ్ రాజ్, మారుపాక శంకర్, రత్న కొమురయ్య, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్,యువజన విభాగం నాయకులు కౌటం సతీష్, సిరిషెట్టి సతీష్,ఆసిఫ్ పాషా,అధ్యక్షులు యాధ వెంకట రమణ, కల్వల రంజిత్, దాసరి విజయ్,

మాధరవెన  కిరణ్, కొత్తపల్లి రాజు, కొక్కిరాల శ్రీనివాస్ రావు,గాధమ్ శాంతి, అష్రఫ్, అడప కృష్ణ, జడల శ్రీనివాస్, & అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: