పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:గోదావరిఖని:అంతర్గాం:సెప్టెంబర్:11:23:తెలంగాణ పోలీసులు దేశంలో నంబర్ వన్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లాలో నూతన పోలీస్ భవనాలను మంగళవారం ప్రారంభించారు,8.40 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్,పోలీస్ వెల్ఫేర్ సెంటర్ అండ్ కమ్యూనిటీ హాల్,అంతర్గాం పోలీస్ స్టేషన్ లను యండి.మహముద్ అలీ,రాష్ట్ర హోం జైళ్ళు,అగ్నిమాపక శాఖ మంత్రివర్యులు,మరియు కొప్పుల ఈశ్వర్ సంక్షేమ శాఖ మంత్రివర్యులు,రాష్ట్ర డిజిపి యం.మహేందర్ రెడ్డి ఐపీఎస్,తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా,రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్,పుట్ట మధుకర్ చైర్ పర్సన్ జిల్లా పరిషత్ పెద్దపల్లి,బోర్లకుంట వెంకటేష్ నేత పెద్దపల్లి మెంబర్ ఆఫ్ పార్లమెంట్,పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి,ఐపిఎస్,కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఐపిఎస్,పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డా:ఎస్.సంగీత సత్యనారాయణ ఐ.ఎ.ఎస్,తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎస్పి చేతన,ఐపిఎస్ మేడం పెద్దపల్లి డీసీపీ రూపేష్ ఐపిఎస్,సునీల్ కుమార్ చీప్ జనరల్ మేనేజర్ ఎన్టీపీసీ తో కలసి ప్రారంభించారు,ఈ సందర్భంగా హోంశాఖ మంత్రివర్యులు ఎండి.మహముద్ అలీ మాట్లాడారు,రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీసులకు పెద్దపీట వేసి శాంతి భద్రతల విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.అభివృద్ధి శాంతిభద్రతలు ఉన్న రాష్ట్రాలు ఎక్కువ అభివృద్ధి చెందుతాయని అందుకు తెలంగాణ నిదర్శనమని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు అధునాతనమైన వాహనాలు సమకూర్చడం మరియు ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నారని,కార్పొరేట్ స్థాయి ప్రజల సౌలభ్యం కోసం సిటిజెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పథకం కింద ఆధునిక సదుపాయాలతో భవనాలు నిర్మిస్తున్నామని,స్నేహపూర్వక పోలీసింగ్ లో తెలంగాణ పోలీసులకు ముఖ్యమైన స్థానం ఉందని,మహిళల రక్షణ షీటీమ్స్,భరోసా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.డయల్ 100 కాల్ చేయగానే పోలీసులు 5 నుండి 10 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకొని సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు.ప్రజలకు పోలీసుల పైన నమ్మకం కలిగిందన్నారు.డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పోలీసుల రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ఎన్నో రివార్డులు అవార్డులు పొందడం జరిగిందన్నారు.తెలంగాణ పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతల పరిరక్షణలో నెంబర్‌వన్ గా పనిచేస్తుందని అన్నారు.దేశం మొత్తంలో ఉన్న సీసీ కెమెరాలలో మన తెలంగాణ రాష్ట్రంలోనె 64% సీసీ కెమెరాలు ఉన్నాయని పేర్కొన్నారు.తద్వారా నేరాలు అదుపులోకి వచ్చాయని అన్నారు. దరఖాస్తు రాయలేని వారు పోలీస్ స్టేషన్కు వెళితే పోలీసులు ఫిర్యాది చెప్పిన విధంగా దరఖాస్తు రాసి కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు ఏ సంఘటన జరిగినా పోలీసులు 24X7 అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారని పండుగల సమయంలో ఎలాంటి శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమని తెలిపారు.పోలీస్ శాఖలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సీఎం ఇవ్వడం జరిగిందని,భారీ ఎత్తున పోలీసులను రిక్రూట్మెంట్ చేయడం జరిగిందన్నారు.రామగుండం కమిషనరేట్ పోలీసులు పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని అభినందించారు.గోదావరిఖనిలో త్వరలో మహిళ పోలీస్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.గోదావరిఖని 1టౌన్ మోడల్ పోలీస్ స్టేషన్, పోలీస్ వెల్ఫేర్ సెంటర్ అండ్ కమ్యూనిటీ హల్,అంతర్గాం పోలీస్ స్టేషన్ అధునాతనంగా నిర్మించడం జరిగిందని,గోదావరిఖనిలో టౌన్ పోలీస్ స్టేషన్కు నూతన భవనాన్ని నిర్మించుకోవడం అనేది ఒక చారిత్రకమైన ఘట్టం.మొదటి నుంచి కూడా కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు గానీ,ఇప్పుడు పెద్దపల్లి జిల్లా అయిన తర్వాత గోదావరిఖని మొత్తం రాష్ట్రం అభివృద్ధిలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ప్రదేశం రాష్ట్రానికి అంతా కూడా ఎనర్జీ నీడ్స్ కోసం ఇక్కడ నివసించే కార్మికులు అందరూ కూడా అహర్నిశలు కష్టపడి చెంటోడిచి ఇక్కడ వాళ్ళ ప్రొడక్ట్స్ చేసినటువంటి బొగ్గు ద్వారా రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా అభివృద్ధి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి"ఖని" ప్రదేశంలో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని కట్టుకోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అందరికీ కూడా అభినందనీయం అయినటువంటి విషయం అని అన్నారు.ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ఒక దేవాలయం లాంటిది ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ మాది పోలీస్ స్టేషన్లో ఉన్న ఉద్యోగులు అందరూ కూడా మంచి కొరకు పని చేయాలని చెప్పి ప్రజలు ఆశించడం అట్లాంటి అవసరాల దృష్ట్యా ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చిన ప్రజలు అందరికీ కూడా మంచి సౌకర్యాలు అందించడానికి ఒక మోడల్ పోలీస్ స్టేషన్ ను నిర్మించాలి అని పోలీస్ స్టేషన్ హౌస్ కార్పొరేషన్ చైర్ పర్సన్ కోలేటి దామోదర్ స్టాండ్ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కాలరీస్ యాజమాన్యం ముఖ్యంగా C&MD నీ రిక్వెస్ట్ చేసి ఇక్కడ సి ఎస్ ఆర్ ఫండ్ తీసుకువచ్చి,భవనాన్ని కట్టడం అనేది చాలా సంతోషమైన విషయం హోం శాఖ మంత్రి,అలాగే జిల్లా ఆమధ్యులు మన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు లోక్సభ సభ్యులు మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొని పోలీస్ వ్యవస్థను దీవించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.కొత్త పోలీస్ స్టేషన్ మంచి వసతులు కాబట్టి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ ఇక్కడ పనిచేసే అధికారులు అందరూ కూడా ఒక పీపుల్ ఫ్రెండ్లీ వాతావరణంలో ఇక్కడ పనిచేస్తూ ఇక్కడ నివసించే కార్మికులందరికీ,ప్రజలుకు సమన్యాయం చేస్తూ సమన్యాయంగా ధైర్యంగా పోలీస్ స్టేషన్ ప్రజలు అందరికీ కూడా సత్వర సేవలు అందించాలని అధికారులకు సూచించారు.గోదావరిఖని పట్టణంలో ప్రారంభించిన భవనాలు ద్వారా ప్రజలకు మరింత విస్తృతంగా సేవలందించాలని మంత్రి సూచించారు.శాంతిభద్రతల అంశంపై సీఎం కేసీఆర్ ప్రాధాన్యత కల్పిస్తూ అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నరని,పోలీస్ ఉన్నతాధికారులు ప్రవేశపెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ద్వారా మంచి ఫలితాలు లభించాయని మంత్రి తెలిపారు.జాతీయస్థాయి నివేదికల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ చాలా మేరకు తగ్గిందని తెలిపారు.రానున్న రోజుల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తెస్తామని అన్నారు.ప్రజలతో స్నేహపూర్వక వైఖరి అనుసరిస్తు పోలిస్ శాఖ కట్టుదిట్టంగా శాంతి భద్రతలను అమలు చేస్తుందని ఆయన ప్రశంసించారు,ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు వీలుగా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ గోదావరిఖని పట్టణంలో పోలీస్ స్టేషన్ భవనం నిర్మించుకున్నామని,వీటి ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలని,ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు.పట్టణంలోని యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు పోలీస్ వ్యవస్థను ఎమ్మెల్యే అభినందించారు.గోదావరిఖని పట్టణంలో రూ,3.4 కోట్ల వ్యయంతో పోలీస్ అతిథి గృహం నిర్మించడానికి సహకరించిన ఎన్టిపిసి సంస్థకు,రూ.3.5 కోట్లతో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నిర్మించడానికి సహకరించిన సింగరేణి సంస్థ వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఆన్ లైన్ టెండర్ ద్వారా పారదర్శకంగా భవన నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు.గోదావరిఖని–I టౌన్ మోడల్ పోలీస్ స్టేషన్,పోలీస్ వెల్ఫేర్ సెంటర్ మరియు కమ్యూనిటీ హాల్ అoతర్గాం పోలీస్ స్టేషన్ నిర్మాణం కావాలని,సింగరేణి మరియు ఎన్టీపిసి సంస్థల నుండి నిదులను సమకూర్చడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ భవనాల నిర్మాణంకి కృసి చేసిన రామగుండము ప్రాంతవాసి ఐనా కోలేటి దామోదర్ గుప్తా,చైర్మెన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిం,తెలంగాణా రామగుండము కమీషనరేట్ పోలీస్ తరుపున ప్రత్యేకమైన ధన్యవాదాలు,కృతజ్ఞతలు అని అదేవిధంగా నూతన గోదావరిఖని–I టౌన్ మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణంకి ఆర్దిక సహాయం అందించిన సింగరేణి సంస్థ వారికీ,పోలీస్ వెల్ఫేర్ సెంటర్ మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణంకి ఆర్దిక సహాయం చేసిన ఎన్టీపిస యజమాన్యంకి ధన్యవాదాలు,కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని ఏసీపీ లు,గోదావరిఖని ఏసిపి గిరిప్రసాద్,గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు,ప్రసాదరావు,రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ లు,మేయర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ అభిషేక రావు,కార్పొరేటర్ అడ్డాల స్వరూప,కార్పొరేటర్ కలవల శిరీష,అంతర్గాం ఎంపీపీ దుర్గం విజయ జడ్పిటిసి అంతర్గం ఆముల నారాయణ,వైస్ ఎంపీపీ అంతర్గం,మట్ట లక్ష్మి,బ్రాహ్మణపల్లి సర్పంచ్ ప్రవీణ్,అంతర్గాం సర్పంచి కుర్ర వెంకటమ్మ,హోసింగ్ బోర్డు అధికారులు సిఇ విజయ్ కుమార్,ఈఈ శ్రీనివాస్,ఏ సి సాయి చాంద్,ప్రజాప్రతినిధులు,పోలీస్ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: