ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం  ప్రజా వాణి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ నిర్వహించారు. వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ, మాట్లాడుతూ

ప్రజావాణి ద్వారా ప్రజలకు వెంటనే సేవలు అందించాలన్నారు.

 సోమవారం ప్రజా వాణి కార్యక్రమంలో ( 95 ) దరఖాస్తులు వచ్చాయని అందులో నగర్ పాలక సంస్థ 11, పోలీస్ 2, పంచాయితి రాజ్ 5, ఉపాధి కల్పన శాఖ, 2, డిఆర్డిఎ 3, ఎస్సి కార్పొరేషన్ 4, ఎంపిడిఓ లకు 13, తదితర శాఖ లకు, చెందిన దరఖాస్తులు ఉన్నాయని  అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ  తెలిపారు. ఈ కార్యక్రమలో డిఆర్ఓ వాసు చంద్ర , డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, డిఐసి జిఎం హరి ప్రసాద్, మెప్మా పీడీ బద్రునాయక్, డివైఎస్ఓ అశోక్ కుమార్, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ సబిత, ఎస్సి కార్పొరేషన్ ఈడి మాధవి లత, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: