ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

 అజ్ఞాత మావోయిస్టులు లొంగిపోతే వారిపై ఉన్న కేసులు ఎత్తివేస్తామని,  జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్ట్ లకు ఉపాధి మరియు ప్రశాంత జీవనానికి జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  సురేందర్ రెడ్డి అన్నారు. గురువారం భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీ, సింగరేణి కమ్యూనిటీ హాల్లో అజ్ఞాత మావోయిస్టుల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఎస్పీ సురేందర్ రెడ్డి  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఎస్పి  మాట్లాడుతూ జిల్లాలో అండర్ గ్రౌండ్ లో ఏడుగురు మావో కుటుంబాలను  ఎస్పీ  జే. సురేందర్ రెడ్డి  కలిసి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి  జీవనోపాధి సాగుతున్న తీరు, కుటుంబ నేపథ్యం, పిల్లల చదువు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మావోల కుటుంబ సభ్యులకు ఏలాంటి సమస్యలు ఎదురైనా అవసరమైన వైద్య చికిత్సలు అందడానికి అందించడానికి జిల్లా పోలీసు శాఖ సిద్ధంగా ఉదని, అజ్ఞాత మావోయిస్టుల లొంగుబాటుకు సహకరించాలని తనని వారి కుటుంబంలో సభ్యునిగా భావించాలని  ఈ సందర్భంగా ఎస్పి  పేర్కొన్నారు. మావోయిస్టుల కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మందులు, కళ్ళ జోల్లు, దుస్తులు,  అందజేశారు.  మావోలు తమ కుటుంబం, తల్లిదండ్రుల  కోసమయినా అడవి బాటని వీడి  జనజీవన స్రవంతిలో కలసి, తమ వారికి అండగా ఉండాలని ఎస్పీ   పిలుపునిచ్చారు. అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎన్నో తీవ్రమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని ఎస్పి   అన్నారు.  అడవిలో ఉంటున్న వారు జనజీవన స్రవంతిలో కలిస్తే మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.  వనం వీడి జనజీవనంలోకి రావాలని, కాలం చెల్లిన సిద్ధాంతాలతో సాధించేది ఏమీ ఉండదని ఎస్పీ సురేందర్ రెడ్డి   పేర్కొన్నారు.


అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కోసం  తమ  కుటుంబ సభ్యులు, నచ్చజెప్పి వారిని లొంగిపోయేలా కృషి చేయాలని కోరారు. ఎవరైతే లొంగిపోతారో వారికి ప్రభుత్వ పరంగా  పోలీసు సహకారం ఉంటుందని, వారిపైన ఉన్నకేసులన్ని ఎత్తివేసి రివార్డు కూడా అందజేస్తామని,  జిల్లా ఎస్పీ తెలిపారు.    భూపాలపల్లి జిల్లా  ఓఎస్డీ   గౌస్ అలం  మాట్లాడుతూ

 నక్సలైట్లు వారి సిద్ధాంతాల ద్వారా హింస ద్వారా సాధించేది ఏమీ లేదని, అడవిని వీడి జనజీవనంలోకి రావాలని వచ్చేవారికి సహాయం సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.  ఈ కార్యక్రమంలో భూపాలపల్లి,   కాటారం డిఎస్పిలు, ఏ. రాములు, జీ. రామ్మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ సిద్దు వెంకటరాణి,  డాక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్లు రాజిరెడ్డి, జానీ నరసింహులు, పులి వెంకట్, రంజిత్ రావ్, అజయ్, జిల్లా పరిధిలోని ఎస్ఐలు పోలీసు అధికారులు అజ్ఞాత మావోయిస్టు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: