చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపుతోనే మునుగోడు నియోజకవర్గం
అభివృద్ధి సాధ్యమవుతుందని తురిమిళ్ళ నరేందర్ రావుఅన్నారు. చౌటుప్పల్
మున్సిపల్ పరిధిలోని 12,13, 19 వార్డులలో బిజెపి కార్యకర్తలతో కలిసి సోమవారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా తురిమిళ్ళ నరేందర్ రావు మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ప్రజలు అభివృద్ధికి బాటలు వేసుకోవాలన్నారు. అభివృద్ధే ధ్యేయంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, పదవి త్యాగంతోనే పెన్షన్లు రోడ్లు వచ్చాయన్నారు. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తారన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 12,13, 19వార్డుల ప్రచారం నిర్వహించడం జరిగింది..

Post A Comment: