ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

ముఖ్యమంత్రి కార్యదర్శి  స్మిత  సభర్వాల్, హరితహారం ఓఎస్డి ప్రియాంక వర్గీస్ హనుమకొండ పట్టణంలోని భద్రకాళి అమ్మవారిని శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. 

ఈ సందర్భంగా మంత్రులకు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం  వారికి ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం వేయి స్తంభాల  దేవాలయంను సందర్శించారు. 

ఈ  సందర్బంగా స్మిత సభర్వాల్ మాట్లాడుతూ.

వేయి స్థంబాల  దేవాలయం లోని రుద్రేశ్వరుడిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంది అని అన్నారు. తెలంగాణ రాష్టం సుభిక్షంగా ఉండాల‌ని  ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా వుండాలని ఆకాంక్షించారు. 

అతి పురాత‌న‌, కాక‌తీయుల నాటి, ఎంతో  ఘనత ఉన్న ఆల‌యం వేయిస్తంభాల గుడి అని అన్నారు.   అనంతరం కల్యాణమండపం పనులను పరిశీలించారు. ఆలయాల చరిత్రను వారికి అధికారులు వివరించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రావిణ్య, ఆలయ ఈఓ శేషు భారతీ, తదితరులున్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: