మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
2018 లో జరిగిన ఒప్పందం లోని పెండింగ్ అంశాలు అమలుచేయమని గత 22న జేఏసీ అధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మిక నాయకులు మరియు కాంట్రాక్టు కార్మికుల పై లాఠీ ఛార్జి చేసి తలలు పగిలేలా, కాళ్లు చేతులు విరిగేలా కొట్టడం దుర్మార్గమైన, చర్య అని నాయకులు అన్నారు.దాడికి కారకులైన ఎన్టీపీసీ అధికారులను, CISF సిబ్బందిని సస్పెండ్ చేయాలని,కేసులు చేయాలని డిమాండ్ చేశారు.కార్మికులు చేసే పోరాటాలకు కార్మివర్గ పార్టీ గా సీపీఎం అండగా ఉంటుందని, ఈ పోరాటం ప్రజపొరట o గా మరకముందే ఎన్టీపీసీ యాజమాన్యం మొండిగా వ్యవ హరించకుండా కార్మికసంఘాలతో యాజమాన్యం చేసుకున్న ఒప్పందంలోని పెండింగ్ అంశాలను వెంటనే అమలు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ కార్యదర్శి ఎం రామాచారి,నాయకులు గిట్ల లక్ష్మారెడ్డి, కదశి మల్లేష్, టీ.రవీందర్,M. సాంబయ్య, మమిడల శంకర్ , బి.నారాయణ,గోపాలరెడ్డి, E నర్సయ్య,దర్ని రాజయ్య,T. నారాయణరెడ్డి,మదనయ్య, పాల్గోన్నారు

Post A Comment: