ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఈ నెల 31 నుండి వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఛీఫ్ విప్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను మరియు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వినాయక మండపాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ , మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా , నియోజకవర్గ యువతకు మట్టి వినాయకులను మాత్రమే పూజించి కాలుష్యంతో నిండుకుపోయిన పర్యావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.రసాయనాలతో తయారుచేసిన వినాయక విగ్రహాల వలన చెరువులు, కుంటలు నాశనం అవుతున్నాయన్నారు.
పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తు చేశారు. మట్టి వినాయకులనే పూజిద్దాం-పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను కోరారు.
ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు బస్వరాజ్ సారయ్య, నగర్ మేయర్ సుధారాణి, జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్,మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య ,జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: