ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల అధికారులతో  ఎస్పి  జె. సురేందర్ రెడ్డి   శనివారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎస్పీ  మాట్లాడుతూ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల లో సిబ్బంది నేరాల సంఖ్యను  తగ్గించే విధంగా కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని నమోదైన కేసులలో నాణ్యమైన దర్యాప్తు చేపడుతూ కోర్ట్ డ్యూటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కోర్టు ట్రయల్ కు ఎప్పటికప్పుడు హాజరవుతూ కన్విక్షన్ల శాతాన్ని పెంచాలన్నారు.  అలాగే పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా ఉండాలని, వారు తీసుకొచ్చే ఫిర్యాదులను చట్టప్రకారం తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అన్ని వర్టికల్ లలో  ప్రతిభ చూపిన 14  మంది పోలీసు అధికారులు, సిబ్బందికి   KPI   (కీ పర్ఫామెన్స్ ఇండికేటర్)  ప్రసంశ పత్రాలు అందజేశారు.

జిల్లా లో మహిళల మరియు పిల్లల పట్ల జరుగే నేరాల పట్ల త్వరగా స్పందించి, కేసు నమోదు చేసి నాణ్యతతో కూడిన దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లను, నియమిత కాలంలో  కోర్టుకు సమర్పించాలన్నారు. పాత కేసులలో కూడా దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు.

ఎస్సీ & ఎస్టీ లపై  జరుగే నేరాలలో దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసి నియమిత సమయంలో కోర్టులో ఛార్జిషీటు సమర్పించవలసిందిగా ఎస్పి సురేందర్ రెడ్డి  ఆదేశించారు.

పాత కేసులలో FSL రిపోర్టులు పెండింగ్ లేకుండా చూసుకొని త్వరగా రిపోర్టులను సేకరించి ఛార్జ్ షీట్లు కోర్టులో సమర్పించాలని ఆదేశించారు. ప్రాపర్టీ సంబంధిత కేసులలో ప్రత్యేక కార్యాచరణ తో కేసులను ఛేదించాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు, కాటారం, భూపాలపల్లి డిఎస్పీలు, బోనాల కిషన్, ఏ రాములు, డీఎస్పీ కిషోర్ కుమార్, ఇన్స్పెక్టర్ లు పెద్దన్నకుమార్, జానీ నరసింహులు, వాసుదేవరావు,  అజయ్ కుమార్, పులి వెంకట్, రంజిత్ రావు, కిరణ్, సతీష్ జిల్లా పరిధిలోని ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: