మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని... పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలనే సంకల్పంతో తాము చేసిన ప్రయత్నాలు ఫలించి రామగుండం మెడికల్ కళాశాలకు కేంద్రం నుండి అనుమతులు లభించడం పట్ల ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆనందం వ్యక్తం చేశారు. గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ... సమాఖ్య పాలన తెలంగాణలోని వైద్య వ్యవస్దను గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారరు.
సమైక్య రాష్ట్రంలో కేవలం రెండు మెడికల్ కళాశాలలు మాత్రమే ఉంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 8 మెడికల్ కళాశాలలను మంజూరు చేసిన ఘనత సి.ఎం కేసీఆర్ ది అన్నారుజిల్లా కేంద్రంలోనే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిబంధన ఉన్నప్పటికీ స్థానిక ప్రజల పట్ల కెసిఆర్ కు ఉన్న అభిమానం మేరకు సింగరేణి సహకారంతో ప్రత్యేకంగా మెడికల్ కళాశాలను మంజూరు చేసినట్లు చెప్పారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మెడికల్ కళాశాలను సాధించుకున్నామని రామగుండం ప్రజల దశాబ్దాల కళ నేరవెర్చమని చెప్పారు.
ఆరంభం నుండి ఈ మెడికల్ కళాశాలను అడ్డుకునేందుకు పలువురు నాయకులు అనేక రకాల అడ్డంకులను సృష్టించారని అయినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రయత్నాలను కొనసాగించి అంతిమ విజయం సాధించడం జరిగిందన్నారు.150 సీట్లకు అనుమతి లభించిన నేపథ్యంలో ఈ సంవత్సరంలోనే మెడికల్ కళాశాలనుప్రారంభిస్తామన్నారు.రామగుండం నియోజకవర్గం లోని పేదప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించెందుకు మెడికల్ కళాశాల ప్రసాదించిన ఆరోగ్య ప్రధాత సిఎం కేసీఆర్ అన్నారు.అనంతరం రామగుండం మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుండి అనుమతి లభించడానికి హర్షిస్తూ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. సంబరాలు జరుపుకున్నారు ఈ విలేఖరుల సమావేశం లో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు
మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ హిమబిందు హాస్పిటల్ డిప్యూటీ సూపరిందెంట్ అశోక్, కార్పొరేటర్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెరాసపట్టి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post A Comment: