మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి నెంబర్ టు గేటు వద్ద జేఏసీ నాయకులు 2018 అగ్రిమెంటు మరియు కార్మికులకు రావలసిన హక్కులకై మేనేజ్మెంట్తో ఇంతకుముందు జేఏసీ నాయకులతో చర్చలు జరిపి కార్మికులకు రావలసిన 2018 అగ్రిమెంట్ లో ఉన్న హక్కులు మరియు అలవెన్సులు అన్ని ఇస్తామని ఎన్ టి పి సి మేనేజ్మెంట్ ఒప్పుకొని ఇప్పటికి సంవత్సరం గడుస్తున్న ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఇప్పటికైనా కార్మికులకు రావాల్సిన హక్కులు ఇవ్వాలని జేఏసీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై ఎన్టిపిసి యాజమాన్యం సిఐఎస్ఎఫ్ సిబ్బందిని ఉసిగొల్పి జేఏసీ నాయకులపై దాడి చేయించినారు ఈ దాడిలో కార్మికులు చాలామందికి మరియు ఐ ఎఫ్ టి యు నాయకుడు రాజేందర్ తీవ్ర గాయాలు తగిలి హాస్పిటల్ పాలు అయినారు యజమాన్యం నిరంకుశ దాడిపై కార్మికులు మరియు రాజకీయ నాయకులు నిరసన తెలిపి ఎన్టిపిసి యాజమాన్యం చేసుకున్న ఒప్పందపు అగ్రిమెంట్లను అన్నిటిని ఇచ్చేవరకు కార్మికులు శాంతియుతంగా ఇంకా పోరాటం చేస్తారని జేఏసీ నాయకులు హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో ఐఎఫ్టియు సిఐటియు హెచ్ ఎం ఎస్ నాయకులు డి సత్యం రాజేందర్ రామాచారి శంకర్ ఇంకా తదితర నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు..

Post A Comment: