ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
42 వ డివిజన్ లెనిన్ నగర్ లో స్థానిక అభివృద్ధికి కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి నూతన బాల ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం వేదబ్రాహ్మణుల ఆధ్వర్యంలో కన్నుల పండుగ గా నిర్వహించడం జరిగింది, కార్యక్రమం నకు ముఖ్య అతిధిగా వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లి దీవెనలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. పోచమ్మ తల్లి ప్రతిష్టాపన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం లో లెనిన్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బోగి సురేష్, స్థానిక నాయకులు కమలాకర్, యాదగిరి, అశోక్, విద్యాసాగర్, కుమార్,విజయ్, రాజేష్, కుమార్, శ్రీను,సంజీవ్, కొమురయ్య, చారీ, గిరి, రాజు, హైమ, రజిత, రేణుక, విజయలక్ష్మి, షారద, స్వరూప, సుజాత, స్థానిక ప్రజలు, వేదబ్రాహ్మణులు, పూజారులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: