ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హన్మకొండ వడ్డేపల్లి పోచమ్మ తల్లిని కుటుంబ సమేతంగా తమ ఇంటి నుండి బోనం సమర్పించి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ రేవతి దంపతులు దర్శించుకున్నారు. అనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక మన పండుగలను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించుకుంటున్నామన్నారు.లష్కర్ బోనాలతో ప్రారంభమైన బోనాల పండుగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందన్నారు.వడ్డేపల్లిలో కూడా తమ ఇంటి దైవం పోచమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఘనంగా బోనాల పండుగను నిర్వహించి, ఫలారం బండిని ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ ,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: