ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడానికి పార్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.
ఆదివారం బల్దియా పరిధి 49 వ డివిజన్ లోని ప్రగతినగర్ కాలనీ లో నూతనం గా రూ.41 లక్షల వ్యయం తో నిర్మించిన ప్రగతినగర్ పార్క్ ను నగర మేయర్ గుండు సుధారాణి హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిడబ్లుఎంసి కమిషనర్ పి.ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్ రాజ్ లతో కలసి చీఫ్ విప్ ప్రారంభించారు.
ఈ సందర్భం గా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్.వజ్రోత్సవ వేడుకలను ఘనం గా నిర్వహించాలని ఈనెల 8 నుండి నేటి వరకు నిర్వహించారని ఆదేశించిన మేరకు ప్రజలందరు దేశ భక్తి ని ప్రదర్శిస్తు ఆనాటి త్యాగ ధనులను స్మరించుకోవడం, చివరి రోజున రాష్ట్ర వ్యాప్తం గా వనమహోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం, ఇట్టి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు పెద్దఎత్తున పాల్గొన్నారని అన్నారు.
చరిత్రాత్మక నగరం లోని ప్రగతి నగర్ లో పెద్దఎత్తున వనమహోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనందం గా ఉందన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి , పురపాలక శాఖ మాత్యులు కే. టి.ఆర్.సూచన ల మేరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఉపాధి ఉద్యోగం కోసం నగరానికి వచ్చే వారి సంఖ్య పెరగడం, అనేక కొత్త కాలనీ లు విస్తరిస్తున్నాయని, మేయర్, కలెక్టర్, కమీషనర్ లు నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని ఖాళీ ప్రాంతాలను పరిరక్షిస్తూ, పార్క్ లను ఏర్పాటు చేసి చిన్న పిల్లలకు ఆటవస్తువులు, యువకులకు ఓపెన్ జిమ్ పరికరాల ఏర్పాటు, వృద్ధులకు చక్కటి వాతావరణాన్ని అందించాలన్నారు. నగరంలోని అనేక ప్రాంతాలలో పార్కులను ఏర్పాటు చేయడం జరిగిందని, నగరంలోని పార్కులు మనందరివని, వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, పార్క్ లలో ఇందుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్టర్ తాము అభివృద్ధి చేసి ఇవ్వడం జరుగుతుందని, వీటిని కాలనీ అభివృద్ధి కమిటీ లు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ ఆనాటి స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో అందరిని భాగస్వాములను చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను తీసుకోవడం జరిగిందని అందులో భాగంగా ఆదివారం రోజున స్వతంత్రభారత వనమహోత్సవం గా ప్రగతి నగర్ లో పార్కును ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కార్పొరేషన్ తరపున కూడా స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని, కార్యక్రమాల్లో భాగంగా శాంతికి చిహ్నమైన అశోక స్థూపాన్ని శనివారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆవిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి ఇంటి పైన మువ్వన్నెల జెండా ఎగిరే విధం గా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి మేయర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం వన మహోత్సవంలో భాగంగా చీఫ్ విప్ , మేయర్ కలెక్టర్, కమిషనర్, కుడా చైర్మన్ లు పార్క్ లో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల మానస రాంప్రసాద్, అదనపు కమిషనర్ అనిస్ ఉర్ రషీద్, సిహెచ్ ఓ శ్రీనివాసరావు, హెచ్ ఓ ప్రెసిల్లా, డి.ఈ. సంతోష్ బాబు, ఏ.ఈ.అరవింద, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: