మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


హైదరాబాద్ గాంధీభవన్ లో  ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ...

RFCL లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 790 మంది దగ్గర సుమారు 42 కోట్లు వసూలు చేసిన రామగుండం MLA కొరుకంటి చందర్ అనుచరులు..

ఇందులో ఒక బాధితుడు బయట తిసుకచ్చిన అప్పుకి వడ్డీ కట్టలేక నాకు జరిగిన అన్యాయం ఇంకా ఏ బాధితుడికి జరాగద్ధని వాళ్ళందరికీ న్యాయం జరగాలని ఈ రోజు ముంజ హరీశ్ అనే బాధితుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ....

రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తక్షణమే ఆ కుటుంబానికి కోటి రూపాయలు చెల్లించి ఒక ఉద్యోగం ఇవ్వాలని అలాగే RFCL బాధితులoదరికి డబ్బులు చెల్లించాలని, వారికి న్యాయం చేయకపోతే ని ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయాలని చందర్ ను కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. బాధితులు స్వయంగా ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చి మోసపోయారో  తెల్పినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతోనే ఈరోజు హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.

దీనికి ఎమ్మెల్యే మరియు తన అనుచరులుగా చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేసిన దళారులు బాధ్యత వహించాలని అన్నారు. నిజం కళ్లకుకట్టినట్టుగా కనబడుతుంటే జరిగిన దందాలో స్థానిక 

ఎమ్మెల్యే  పేరు వినబడుతున్నా, తన పాత్ర ఉన్నదంటున్నా తమకేమి తెలియదన్నట్లుగా కమిటీ వేస్తానని, బాధితులు క్యాంపు కార్యాలయంకు  వచ్చి తమ బాధలు చెప్పుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. బాధితులు న్యాయం చేయాలని రోర్డుల మీదికి వచ్చిన వెంటనే సమస్య పరిష్కారం చేస్తే ఈరోజు హరీశ్ ఆత్మహత్య చేసుకునేవాడు కాదని అన్నారు. 

ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే డబ్బులు తిరిగి ఇప్పిస్తారని అన్నారు.

ఇప్పటికయినా చిత్త శుద్దితో స్థానిక ఎమ్మెల్యే గారు,మరియు పోలీసులు స్పందించి హరీష్ ఆత్మహత్య కు కారణమైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు దండుకున్న దళారులను అరెస్టు చేసి వారి నుండి బాధితులకు వెంటనే డబ్బులు చెల్లించే విదంగా చర్యలు తీసుకోవాలని రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: