మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తన డబ్బులతో పాటు తోటి కార్మికులకు డబ్బులు ఇప్పించాలని ఆర్ఎఫ్సిఎల్ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ నేను బలిదానం చేసుకుంటున్నానని వాట్సప్ ద్వారా మెసేజ్ చేసే శుక్రవారం అదృశ్యమైన ముంజ హరీష్ (30) కమాన్పూర్ ప్రాంతంలోని ఒక బావిలో శవమై తేలాడు. శంకరపట్నం మండలం అంబాల్ పూర్ గ్రామానికి చెందిన హరీష్ ఆర్ఎక్స్ ఎల్లో ఉద్యోగం కోసం ఒక బ్రోకర్ ద్వారా సుమారు ఏడు లక్షల రూపాయలు ఇచ్చి లోడింగ్ కార్మికుడిగా చేరాడు. ఐదు నెలల క్రితం అతన్ని తొలగించడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. నిన్న ఉదయం 9 గంటలకు బైక్ పై ఇంటిలో నుంచి వెళ్ళిన హరీష్ మధ్యాహ్నం ఒంటిగంటకు తాను బలిదానం చేసుకుంటున్నానంటూ వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపాడు. అలాగే తన లొకేషన్ కూడా పంపాడు. ఆ లొకేషన్ ఆధారంగా హుజరాబాద్ ఓదెల మండలం పోతులపల్లి వరకు వెళ్లి వెతికిన దొరకలేదు. సాయంత్రం 6 గంటలకు కమాన్పూర్ ప్రాంతంలో ఒక చెరువు వద్ద బైక్, సెల్ ఫోన్లు దొరికాయి. రాత్రంతా ఆ పరిసరాల్లో గాలించారు. ఉదయం ఒక బావిలో హరీష్ మృతదేహం లభించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు.

Post A Comment: