కాటారం : దీపావళి పండుగను పురస్కరించుకొని కాటారం సబ్ డివిజన్ ప్రజలకు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (SDPO) ఏ. సూర్యనారాయణ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా బాణసంచా విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు.

కాటారం సబ్ డివిజన్ పరిధిలోని గ్రామాలు, మండల కేంద్రాల్లో బాణసంచా విక్రయాల కోసం దుకాణాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారులు ముందుగానే సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ), అగ్నిమాపక శాఖ అనుమతి, వాణిజ్య పన్నుల శాఖ నుంచి జీఎస్‌టీ నమోదు, విద్యుత్ శాఖ అనుమతి, సంబంధిత గ్రామపంచాయతీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.

బాణసంచాను ఎంత తక్కువ మొత్తంలో విక్రయించినప్పటికీ అన్ని శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా విక్రయాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అదేవిధంగా దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లల విషయంలో ప్రత్యేక అప్రమత్తత పాటించాలని సూచించారు. బాణసంచా కాల్చే ప్రదేశాల్లో నీళ్లు, ఇసుక వంటి భద్రతా ఏర్పాట్లు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రమాదకర పరిస్థితులకు దూరంగా ఉండాలని కోరారు.

ప్రజలు, వ్యాపారులు పోలీస్ శాఖ సూచనలు, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో దీపావళి పండుగను జరుపుకోవాలని కాటారం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఏ. సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: