పెద్దపల్లి జిల్లా: రామగిరి మండలంలోని ముస్త్యాల, సుందిళ్ల గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు, యువతులు ఘనంగా నిర్వహించారు. ప్రకృతిలో లభించే వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, ప్రకృతిని పూలతో పూజించే సంప్రదాయాన్ని చాటిచెప్పారు. గ్రామాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. “పార్వతి శివుడు ఉయ్యాలో.. సీత రాములు ఉయ్యాలో.. రామ రామనే ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. పార్వతీ పరమేశ ఉయ్యాలో.. శివుడొచ్చే వేళాయే ఉయ్యాలో” అంటూ బతుకమ్మ పాటలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము వరకు ఆటపాటలతో వేడుకలు కొనసాగగా, అనంతరం సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ వేడుకలను ముస్త్యాల గ్రామ సర్పంచ్ సుంకరి మహేందర్, ఉపసర్పంచ్ బాసినేని వినోద్ సత్యనారాయణరావు, సుందిళ్ల గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి, సుందిళ్ల–నరసింహులపల్లి పార్టీ అధ్యక్షుడు బోగిరి భాస్కర్ తిలకించి, వేడుకలను పర్యవేక్షించారు. సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను గ్రామాల ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: