ఆంధ్ర అక్టోబర్ 23 మేడిగడ్డ టీవీ న్యూస్ : వైరామవరం మండల జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా పల్లాల కాసులమ్మ గారిని నామినేషన్ వేయించిన ఆదివాసీ సంఘాల నాయకులు,మేధావులు,విద్యావంతులు,ఉద్యోగస్తులు,విద్యార్థులు,రైతులు,కార్మికులు మరియు పలువురు ప్రజా ప్రతినిధులు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల జేఏసీ డివిజన్ అధ్యక్షుడు వంతుబాలకృష్ణ,ఆదివాసీ చైతన్య సంక్షేమ సంఘం నాయకులు వెదురుల లచ్చిరెడ్డి,ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామదాసు దొర,ఆదివాసీ నిరుద్యోగుల సంఘం నాయకుడు తెల్లం శేఖర్,వైరామవరం మండల భారత ఆదివాసీ పార్టీ సీనియర్ నాయకులు కురుశం సత్యనారాయణ దొర,పల్లాల బుజ్జి,నారాయణరెడ్డి,రోలు పెళ్లి అబ్బాయిరెడ్డి,ఆదివాసీ ప్రజాప్రతినిధుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు మద్దిటి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి పల్లాల కాసులమ్మ మాట్లాడుతూ,పోలవరం జిల్లాలో వెనుకబడిన వైరామవరం మండలాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు.మండలంలో విద్య,వైద్యం,ప్రజల హక్కుల పరిరక్షణ వంటి రంగాల్లో మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.గ్రామాల అభివృద్ధి,ప్రజా సమస్యల పరిష్కారం,విద్యా మరియు వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.ప్రజలు తమ గ్రామాల్లో ప్రజల కోసం పనిచేసే ఎంపీటీసీ అభ్యర్థులను,మంచి నాయకత్వాన్ని అందించే వ్యక్తులను ఎంపిక చేసుకోవాలని ఆమె కోరారు.అలాగే తనకు కూడా తమ అమూల్యమైన ఓటును వేసి స్వతంత్ర జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపించాలని వైరామవరం మండల ప్రజలను విజ్ఞప్తి చేశారు.వైరామవరం మండలంలోని ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాల ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను,సమస్యలను తెలియజేసి మండల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు...

Post A Comment: