మహాదేవపూర్: ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేదని మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మంథని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కేదారి గీత అన్నారు. మహాదేవపూర్ దసరా ఉత్సవాలపై ఓ పెద్దాయన చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో ప్రజల ఓట్లు కోరుతూ, తప్పులు జరిగినప్పుడు మాత్రం ప్రజలకు ప్రశ్నించే నైతిక హక్కు లేదనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

దసరా ఉత్సవాల పేరుతో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసి గ్రామ ప్రతిష్టను దిగజార్చారని ఆమె ఆరోపించారు. మంత్రి సోదరుడి కోసం రావణ వధ కార్యక్రమాన్ని రెండు గంటలు ఆలస్యం చేయడంతో వేలాది మంది ప్రజలు ఎండలో వేచి ఉండాల్సి వచ్చిందని విమర్శించారు. అంతేకాకుండా కూలీలు, చిన్న దుకాణాల నిర్వాహకుల నుంచి సైతం బలవంతంగా చందాలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, ఇలాంటి అంశాలపై ప్రజలు ప్రశ్నించకూడదా అని నిలదీశారు.

ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగానే, తమ సొమ్ము ఎక్కడ ఖర్చు చేశారు, పండుగ నిర్వహణ ఎలా సాగింది అనే విషయాలను తెలుసుకునే హక్కు కూడా కలిగి ఉంటారని కేదారి గీత స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యంత ముఖ్యమని, ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది పోయి, వారికి ప్రశ్నించే స్థాయి లేదని వ్యాఖ్యానించడం తగదని ఆమె విమర్శించారు. ప్రజల గొంతును నొక్కాలని చూస్తే వారు తగిన సమయంలో ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెబుతారని హెచ్చరించారు. ప్రజల ఆందోళనలు, ప్రశ్నలను గౌరవిస్తూ ఉత్సవాల నిర్వహణలో పారదర్శకత పాటించాలని కేదారి గీత కోరారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: