గ్రామానికి చెందిన యువత వాలీబాల్ క్రీడలో చురుగ్గా పాల్గొంటూ ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ, అవసరమైన క్రీడా సామగ్రి అందుబాటులో లేకపోవడంతో వివిధ టోర్నమెంట్లలో పాల్గొనలేకపోతున్న విషయాన్ని టీఆర్‌పీ మండల అధ్యక్షుడు మీసాల రాజు, వ్యవసాయ విభాగం అధ్యక్షుడు పింగిడి శంకరయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు లక్కాకుల రాకేష్ రవి పటేల్ దృష్టికి తీసుకెళ్లారు. యువత సమస్యను తెలుసుకున్న రవి పటేల్ స్పందించి వాలీబాల్ నెట్‌తో పాటు క్రీడా సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన అనేక మంది యువ క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం, అవసరమైన క్రీడా సామగ్రి అందిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందని తెలిపారు.
దూదేకులపల్లి యువత క్రీడల్లో మరింతగా రాణించి గ్రామానికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని రవి పటేల్ ఆకాంక్షించారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ తనవంతు సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
టీఆర్‌పీలోకి యువత భారీగా చేరికలు.
అనంతరం దూదేకులపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. తీన్మార్ మల్లన్న చేస్తున్న రాజకీయ పోరాటానికి మద్దతు ప్రకటిస్తూ పార్టీలో చేరిన యువతకు టీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. యువత తలచుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. యువత రాజకీయ, సామాజిక అంశాలపై అవగాహన పెంచుకుని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని సూచించారు.
టీఆర్‌పీ సామాజిక న్యాయం, ప్రజల హక్కుల కోసం చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు కొత్తగా చేరిన యువత తెలిపారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని పేర్కొన్నారు. ముఖ్యంగా మైనారిటీ యువత కూడా తీన్మార్ మల్లన్నతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌పీ జిల్లా నాయకులు జినుకల శ్రీను, ముదిరాజ్ మోటపోతుల సమ్మయ్య, దూదేకులపల్లి గ్రామ శాఖ నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: