పెదపల్లి: గోదావరిఖని సెప్టెంబర్ 12 : సింగరేణి సంస్థలో ప్రస్తుత గుర్తింపు సంఘం పదవీ కాలం ముగిసినందున వెంటనే నూతన కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని,సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్'(సీఐటీయూ)డిమాండ్ చేసింది.ఈ మేరకు శనివారం రామగుండం-2ఏరియాలోని ఓసీపీ-3 ప్రాజెక్టు మేనేజర్ సంపత్ కుమార్ కు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సీఐటీయూ బ్రాంచ్ సెక్రటరీ కుంట ప్రవీణ్ కుమార్ మాట్లాడురు,డిసెంబర్ 27,2023న నిర్వహించిన ఎన్నికల ఆధారంగా,సెప్టెంబర్ 09,2024న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గుర్తింపు యూనియన్ రెండేళ్ల కాలపరిమితి ఈ ఏడాది సెప్టెంబర్ 08,2026తో ముగిసినందున...సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి నూతన ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు.కొత్త ఎన్నికలు జరిగి ఫలితాలు వెల్లడయ్యే వరకు,కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా నమోదు కాబడిన అన్ని రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్లకు సమాన అవకాశాలు,ప్రాతినిధ్యం సమానహోదా కల్పించాలని డిమాండ్ చేశారు.గతంలో 13-06-2023న హైదరాబాద్ సింగరేణి కాలర్స్ కంపెనీ వారి సమక్షంలో యాజమాన్యం సర్క్యులర్ ద్వారా తెలిపిన విధంగా,ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు అన్ని యూనియన్లకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాంప్రసాద్,వినేష్,సంపత్, శివకుమార్,శ్రీనివాస్,రాజేందర్,మల్లేష్,రాజశేఖర్,శ్యాం ప్రసాద్, సంతోష్‌లు...ఇతర కార్మిక సంఘ నాయకులు,కార్మికులు తదితరులు పాల్గొన్నారు...

Post A Comment: