కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల ఆవరణలో డీటీఎఫ్ కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో గురుకుల విద్యార్థుల సౌకర్యార్థం 8 వీధిలైట్లను పంపిణీ చేశారు. జిల్లా శాఖ సహకారంతో పేరు వెల్లడించేందుకు ఇష్టపడని దాత ద్వారా వీటిని అందించారు.

ఈ పాఠశాలల పరిసర ప్రాంతంలో ట్రైబల్ వెల్ఫేర్ బాలికల, బాలుర పాఠశాలలు, కేజీబీవీ, జెడ్పీహెచ్‌ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 2,500 నుంచి 3,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 60 నుంచి 70 మంది వరకు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో పాఠశాలల ఆవరణ సమీపంలోని రహదారిపై వీధిలైట్లు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుక్కల బెడదతో పాటు పాములు, తేళ్ల సంచారం వల్ల భయాందోళనకు గురవుతున్న పరిస్థితిని గుర్తించిన డీటీఎఫ్ ఈ సమస్య పరిష్కారానికి వీధిలైట్లు ఏర్పాటు చేసింది.


ఈ సందర్భంగా ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. డీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం వృత్తిపట్ల అంకితభావంతో పనిచేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు మాట్లాడుతూ.. డీటీఎఫ్ నాటి నుంచి నేటి వరకు అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం గర్వించదగ్గ విషయమన్నారు.

డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. తిరుపతి మాట్లాడుతూ.. గత విద్యా సంవత్సరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను సందర్శించిన సమయంలో ఉపాధ్యాయుల సమస్యలతో పాటు విద్యార్థుల సమస్యలను గుర్తించామన్నారు. వాటి పరిష్కారానికి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వృత్తిపట్ల నిబద్ధతతో పాటు సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.


కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సడవలి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య, మహాదేవపూర్ సింగిల్ విండో చైర్మన్ చల్ల తిరుపతి, కాటారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్లు లక్ష్మణ్ నాయక్, ప్రభాకర్ రెడ్డి, డీటీఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షుడు జె. కరుణాకర్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు బి. తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి డీటీఎఫ్ మండల అధ్యక్షుడు రాజు నాయక్, మండల ప్రధాన కార్యదర్శి మోహన్ అధ్యక్షత వహించారు.



Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: