జయశంకర్ భూపాలపల్లి, జనవరి 26 : దేశానికి గర్వకారణమైన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పి) భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నాయకత్వంలో జరిగిన ఈ వేడుకలకు టిఆర్పి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో అశోక్ ముదిరాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతపై ప్రసంగిస్తూ… 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడం ద్వారా దేశ పౌరులకు సమాన హక్కులు, స్వేచ్ఛలు, ఓటు హక్కు వంటి ప్రజాస్వామ్య విలువలు లభించాయని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగం దేశ ప్రజలకు గౌరవప్రదమైన జీవనానికి పునాది వేసిందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి పౌరుని బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. తదుపరి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ… రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి, రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్వాతంత్ర్య ఫలాలను ప్రజలకు అందించిన రాజ్యాంగం భారతదేశానికి దిక్సూచి వంటిదని అన్నారు. రాజ్యాంగం అమలైన ఈ పుణ్యదినాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, భూపాలపల్లి జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అశోక్ ముదిరాజ్‌కు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశ సమగ్ర అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో టిఆర్పి జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, సామల శ్రీలత రాజు, ఎస్‌బీఐ అనంతల సంపత్ (బొట్టు), అశోక్ మడే, సంతోష్ ముక్తేశ్వర్, రొడ్డ శ్రీను, జింకల శ్రీను, మామిడి శ్రీకాంత్, రంజిత్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Home
POLITICS ( రాజకీయం )
టిఆర్పి ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు భూపాలపల్లిలో జాతీయ జెండా ఆవిష్కరణ – రాజ్యాంగ విలువలపై నేతల ప్రసంగాలు

Post A Comment: