మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
లింగాపూర్ ఎస్సీ కాలనీ దళితులను సింగరేణి యాజమాన్యం ఏడు సంవత్సరముల నుండి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామంటూ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ సందర్భంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ డైరెక్టర్ దత్తు లింగాపూర్ గ్రామాన్ని సందర్శించి లింగాపూర్ ఎస్సీ కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని ఇప్పటికైనా లింగాపూర్ దళితుల పైన కనికరం చూపించి ఎస్సీ కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని డైరెక్టర్ దత్తు కు మాజీ ఎంపీటీసీ ఇరికిల్ల పద్మ శంకరయ్య కోరారు ఎస్సీ కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఏడు సంవత్సరముల నుండి అడవి పందుల తోటి విషసర్పాలతోటి ప్రమాద పంచున మేము ఉన్నామని కావున ఇప్పటికైనా మా పైన కనికరం చూపి మా ఎస్సీ కాలనీ ఎక్కడైనా సురక్షిత ప్రాంతానికి తరలించాలని సింగరేణి డైరెక్టర్ దత్తును మరియు జీఎం కలవల నారాయణను మాజీ ఎంపీటీసీ ఇరికిల్ల పద్మ శంకరయ్య కోరారు ఎస్సీ కాలనీ ప్రజల సమస్యలను ఓపికతో విని వారి పరిస్థితులను చూసి ఇప్పటికైనా ఎస్సీ కాలనీకి మోక్షం కలుగుతుందో లేదోనని ఎస్సీ కాలనీ ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ ఆర్ డైరెక్టర్ దత్తు ఎస్ డి సి నరసింహమూర్తి ఆర్ జి వన్ జిఎం కలవల నారాయణ సింగరేణి సర్వేయర్ అలీ మల్లికార్జున్ వీరారెడ్డి కాసర్ల మల్లేష్ చంద్రయ్య కళ బుచ్చమ్మ రాజమ్మ తదితర ఎస్సీ కాలనీ ప్రజలు పాల్గొన్నారు

Post A Comment: