మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రమగుండం కార్పొరేషన్ రెండవ డివిజన్ పరిధిలోని పీకే రామయ్య కాలనీవాసులు గత 15 రోజులుగా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పట్టించుకునే వారే కరువయ్యారని సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ అన్నారు పీకే రామయ్య కాలనీలో ఉంటున్న దినసరి కూలీలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని మల్లేష్ అన్నారు 15 రోజుల నుంచి నీళ్ళకి ఇబ్బంది పడుతూ మూడుసార్లు కార్పొరేటర్ దగ్గరికి వెళ్లినప్పటికీ ఇప్పటివరకు కూడా కాలనీ సమస్య తీరలేదని గత ఏడాది తేదీ 6 11 2021 రోజున రామగుండం కార్పొరేషన్ కమిషనర్ పీకే రామయ్య కాలనీకి ఇదివరకు ఉన్న బోర్లకు మూడు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని అప్పటి కమిషనర్LRROC NO F2/319/11 2020_2021. ద్వారా TSNPDCL అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ కు లెటర్ ఇవ్వడం జరిగింది ఈ లెటర్ అందుకున్న విద్యుత్ అధికారులు కరెంట్ సప్లై ఇచ్చారు మా నీటి కష్టాలు తీరిందని సంతోషంగా ఉన్న కూలీలకు మళ్లీ నీళ్ల సమస్య మొదటికి వచ్చిందని తెలిపారు గత 15 రోజుల క్రితం మేం పనులకు వెళ్లి వచ్చేసరికి విద్యుత్ శాఖ అధికారులు వచ్చి మా యొక్క నీటి బోర్లకు అమర్చిన విద్యుత్ సరఫరాను తొలగించారని ఈ విషయంపై మా కాలనీకి బోర్లు వేసి నీటి సమస్య తీర్చిన సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మల్లేష్ కు పరిస్థితిని వివరించగా స్పందించిన మడిపల్లి మల్లేష్ విద్యుత్ ఏఈ దగ్గరకు వెళ్లి విషయం తెలుపగా మాకు కార్పొరేషన్ నుండి బిల్లు రానందున విద్యుత్ సరఫరా తొలగించామని అధికారి చెప్పగా వెంటనే కార్పొరేషన్ ఏఈ రాంజీని వివరణ కోరగా అతను ఇచ్చిన సమాధానం మీ రెండవ వార్డ్ కార్పొరేటర్ లెటర్ ద్వారా మాకు మీ సమస్య రాసి ఇస్తేనే మేము మీటర్లకు డీడీలు కట్టగలమని కార్పొరేషన్ అధికారి తెలిపారని రెండవ డివిజన్ కార్పొరేటర్ ఇంటికి పొద్దున సాయంత్రం మూడు రోజులు తిరిగిన సరైన సమాధానం కాలనీ ప్రజలకు ఇవ్వలేదని మల్లేష్ అన్నారు పీకే రామయ్య కాలనీ ప్రజలు ఓటు వేయలేదా ఇప్పటివరకు కార్పొరేటర్ కాలనీలో డ్రైనేజీలో పేరుకుపోయిన వ్యర్థాన్ని మూడు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు తీసిన దాఖలాలు లేవని మల్లేష్ అన్నారు ఇకనైనా రామగుండం కార్పొరేషన్ అధికారులు పీకే రామయ్య కాలనీ దినసరి కూలీల నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ మేయర్ కమిషనర్ నిరుపేదలు ఉండే పీకే రామయ్య కాలనీ నీ సందర్శించాలని మడిపల్లి మల్లేష్ కోరారు...

Post A Comment: