ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘం నాయకత్వం దృష్టి సారించింది. విద్యాభ్యాసం కొనసాగించేందుకు విద్యార్థులపై పడుతున్న ఫీజుల భారం, కళాశాలల్లో మౌలిక వసతుల కొరత, నాణ్యమైన విద్య అందుబాటులో ఉండే పరిస్థితులు, చదువు పూర్తిచేసిన యువతకు ఉపాధి అవకాశాలు వంటి కీలక అంశాలపై ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని వివరించారు.
విద్యార్థులు తమ సమస్యలను వ్యక్తిగతంగా ఎదుర్కొంటూ మౌనంగా ఉండాల్సిందేనా? విద్యాసంస్థల్లో అవసరమైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు వారికి నాణ్యమైన విద్య, కనీస సౌకర్యాలు కల్పించడంలో సంబంధిత యంత్రాంగం బాధ్యత ఏమిటి? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
విద్యార్థుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు హక్కుల సాధన కోసం AISA నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని బుర్ర స్వాతి పేర్కొన్నారు. విద్యార్థులందరూ సంఘటితమై తమ హక్కుల కోసం గొంతెత్తాలని, మరింత మంది విద్యార్థులు AISAలో చేరి విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల సమస్యలు కేవలం వినతులకే పరిమితం కాకుండా పరిష్కారానికి నోచుకోవాలంటే సంఘటిత విద్యార్థి ఉద్యమం అవసరమనే సందేశంతో ఈ సభ్యత్వ కార్యక్రమం కొనసాగింది.

Post A Comment: