కాటారం అక్టోబర్ 26 మేడిగడ్డ టీవీ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా  కాటారం మండల పరిధిలోని వివిధ బ్యాంకులను కాటారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఈ. భీమేష్, సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తనిఖీ చేశారు. బ్యాంకుల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, బ్యాంకు మేనేజర్లు, సిబ్బందితో మాట్లాడి పలు భద్రతాపరమైన సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా బ్యాంకుల్లో ఏర్పాటు చేసిన అలారం వ్యవస్థ పనితీరును పరిశీలించాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని సూచించారు. బ్యాంకుల్లోని లాకర్ల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా బ్యాంకులకు వచ్చే అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిశితంగా గమనించాలని, భద్రతా పరమైన లోపాలు గుర్తిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. బ్యాంకుల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజల నగదు, విలువైన వస్తువులకు రక్షణ కల్పించేలా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కాటారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఈ. భీమేష్, సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ సూచించారు.



Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: