రామగిరి, అక్టోబర్ 18 (మేడిగడ్డ టీవీ న్యూస్): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామ పరిధిలోని నరసింహులపల్లిలో బోగిరి భాస్కర్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీశ్రీ దుర్గామాతను ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్త్యాల గ్రామ ఉపసర్పంచ్ బాసినేని వినోద్ సత్యనారాయణరావు, పుట్ట రాజన్న, మాజీ ఎంపీటీసీ బోగిరి రాములు తదితరులు అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో బోగిరి భాస్కర్‌తో పాటు పలువురు మహిళలు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. పూజల అనంతరం అర్చకులు ప్రముఖులను ఆశీర్వదించి, శ్రీదుర్గామాత కృపాకటాక్షాలు అందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొంది.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: