కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాదరావుపేట గ్రామపంచాయతీ పరిధిలోని 5వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నూతన గృహ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా ముగ్గు పోసి గృహ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మంజూరైన గృహ నిర్మాణాన్ని ప్రారంభించే సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాస్తు నిపుణుల సూచనల మేరకు శుభ ముహూర్తంలో భూమిపూజ చేపట్టారు. దీంతో తమ సొంతింటి కల నెరవేరబోతుండటంతో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గంగారం వాస్తవ్యులు, వాస్తు నిపుణులు లక్ష్మీరాజు చార్యులు, కేశబోయిన సమ్మయ్య చారి, జాదరావుపేట గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కోట అశోక్, బొద్దుల సతీష్, బద్ది వెంకటేష్, పొరండ్ల రమేష్తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సొంతింటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావడంతో 5వ వార్డులో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గ్రామంలో అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న గృహ నిర్మాణ పథకం ద్వారా సొంతింటి కల సాకారం అవుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.


Post A Comment: