జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 29వ వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అభ్యర్థిగా మామిడి శ్రీకాంత్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్పీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హాజరై నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రవి పటేల్ మాట్లాడుతూ, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల నుంచి టీఆర్పీ తరఫున రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ తరఫున పోటీ చేయదలచిన ఆశావాహులు వెంటనే నాయకత్వాన్ని సంప్రదించాలని కోరారు. భూపాలపల్లి పట్టణ అభివృద్ధి, అవినీతి నిర్మూలన టీఆర్పీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అవినీతి లేని మున్సిపాలిటీలు, ప్రజలకు నిజాయితీగా సేవ చేసే పాలన లక్ష్యంగా రూపొందించబడిందన్నారు. గత పాలకుల అవినీతికి చెక్ పెట్టాలంటే టీఆర్పీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లవేళలా ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు. రేపటితో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో, పోటీ చేయదలచిన అభ్యర్థులు తక్షణమే పార్టీ నాయకత్వాన్ని సంప్రదించాలని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎస్.పీ.కే సాగర్, భూపాలపల్లి మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, సాయికుమార్, శ్రావణ్ కుమార్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: