మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
నేను గత 30సంవత్సరాలకు పైగా రామగుండం నియోజక వర్గ ప్రజాక్షేత్రంలో నిరంతరం తిరుగడుతూ ఉన్నా.
ప్రజలకు ఏ కష్టమొచ్చిన, నష్టమొచ్చిన వారికి అండగా నిలబడిన నియోజక వర్గం లో పలు సమస్యల గురించి కొట్లాడుతున్న, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి పోరాటం చేస్తున్న *గతంలో లో ఉన్న ఇపుడు ఉన్న శాసనసభ్యులు దోచుకోవడం దాచుకోవడం తప్పితే నియోజక వర్గం అభివృద్ధి కి చేసింది శూన్యమనే చెప్పాలి*నేను సవాల్ విసురుతున్న తెలంగాణ లో సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఈ మూడు జిల్లాల్లో ఖర్చు చేసిన నిదులెన్ని పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం నియోజక వర్గానికి తీసుకొచ్చిన నిదులెన్ని ఆ నియోజక వర్గాలకు వచ్చిన ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలెన్ని రామగుండం నియోజక వర్గానికి వచ్చిన సంస్థలెన్ని.
*అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వెడల్పు చేసి సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడం కాదు , సామాన్యుడికి 3పూటలా తిండి అంటే కూడు, గుడ్డ, గూడు ఈ మూడు అందినప్పుడే అది అభివృద్ధి అవుతుంది అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనే విషయాన్ని మీకు ఈ సందర్బంగా తెలియజేస్తున్నాను అంతేకాని ఓ వైపు సామాన్యులు ఉపాధి కరువై ఎలాంటి ఉద్యోగాలు లేక యువత నిరుద్యోగులుగా ఏటకేటా వారి సంఖ్య పెరుగుతుంటే మరో వైపు ప్రజలను మళ్ళీ ఒక సారి దగా చేయడానికి ఆత్మీయకలయిక అనే కార్యక్రమం తో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారు.
నేను నాకోసం కాదు జీవించేది నా ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే బ్రతుకుతున్న ప్రజలకు సేవచేయాలనే తపనే నన్ను ఈ ప్రజా క్షేత్రంలో నడిపిస్తుంది.ప్రజలకు సేవచేయాలనే తపన ఉంటే సరిపోదు చేతిలో పవర్ ఉంటేనే సాధ్యమవుతుంది కాబట్టి ఇప్పటికి *రెండు సార్లు పోటీ చేశా చాలా కోల్పోయాను, పెద్ద మొత్తంలో నష్ట పోయాను అయినా కూడా నేను ఎక్కడా ప్రజలకు చేసే పనుల్లో కాంప్రమైస్ కాలే నేను పవర్ లో లేకున్నా నాకున్న పలుకుబడి మేరకు హాస్పటల్ లో వైద్యం గురించి కానీ పలు సమస్యల గురించి కానీ అనుక్షణం స్పందిస్తూనే ఉన్నా ప్రజలకు నా అవసరం ఉందనిపిస్తుందని తెలుసుకున్నాను కాబట్టి గతంలో ఎవరెవరినో నమ్మి ఎందరికో అవకాశం ఇచ్చిన నా నియోజక వర్గ ప్రజలను కోరుతున్న ప్రజా సేవకే నా ఈ జీవితం అంకితం ప్రజలకంటే నాకు ఏది ఎక్కువ కాదు నాకు ఈసారి ఒక్క అవకాశం ఇవ్వండి కుంటున పడ్డ నియోజక వర్గం అభివృద్ధిని పురోభివృద్ధి చేసి చూపిస్తానని మాట ఇస్తున్న.
నిన్ననే తెలిసింది అక్టోబర్ లో ఎలక్షన్స్ కి వెళ్లే అవకాశం ఉందని చైతన్యం వైపుగా అడుగులేస్తున్న *నా నియోజక వర్గ ప్రజలారా దయచేసి ఈసారి రామగుండం ఎమ్మెల్యే గా అవకాశం ఇవ్వండి ప్రజల ఋణం తీర్చుకోవడానికి ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

Post A Comment: