మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
డీసీసీ అధ్యక్షులు రాజ్ ఠాగూర్ నాయకత్వంలో రామగుండం తహసీల్దార్ కు లబ్దిదారుల జాబితా అందజేయాలనీ వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఎన్నో ఏళ్లుగా వెనకబడి ఆర్థిక పరమైన సమస్యలు ఎదురుకొంటూ నానా ఇబ్బందులు పడుతున్న *గంగపుత్ర మహిళల ప్రాథమిక రామగుండంమస్థ్య సహకార సంగం కు*మార్కెట్ సొసైటీ ఏర్పాటు చేయాలనీ వీరు ఎలాంటి ఉపాధి లేక చేపలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారని కాబట్టి ఇదే వృత్తిగా నమ్ముకొని జీవనము సాగిస్తున్న గంగపుత్ర మహిళలకు ప్రభుత్వం అందించే మత్స్యకార శాఖ నుండి వచ్చేటువంటి పథకాలకు అర్హులవుతారు కాబట్టి అలాగే ఏదైనా జరగరాని ప్రమాదం జరిగి నష్టపోయినట్లయితే వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి ఇందులో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాని ప్రభుత్వెతర సంస్థల్లో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పనిచేసేటువంటి వారు ఎవరు లేరు కాబట్టి సుమారు 150 మంది వరకు సభ్యులుగా ఉన్న గంగపుత్ర మహిళలకు ప్రాథమిక మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం రామగుండం ఏర్పాటుకై లబ్ధిదారుల జాబితాకు సంబంధించి నివేదిక ఇవ్వగలరని రామగుండం తాసిల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన *మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ మార్గ నిర్దేశకంలో*కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమములో పల్లికొండ రాజేష్, కునారపు ప్రేమ్, బింగి నరేష్, పల్లికొండ మల్లయ్య, బింగి వెంకటేష్, షేక్ సాబీర్ మరియు మహిళా కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: