మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టుగా ఉగాది రాష్ట్ర పురస్కారం పొందిన సంధర్భంగా రామగుండం ప్రెస్ క్లబ్ ప్రచార కార్యదర్శి దార మొండయ్య(మధు) ను రామగుండం ప్రెస్ క్లబ్ లో ఆవుల రాజేష్ యాదవ్,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ జమీల్ హుస్సేన్ లతో కలిసి ఘనంగా శాలువాతో సన్మానం చేసినారు.రాజేష్ యాదవ్ మాట్లాడుతూ మధుకు ఈ అవార్డు రావడం పట్ల హార్షము వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.వార్త సేకరణలో నిర్భయంగా ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ముందు వరుసలో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లక్ష్మి నారాయణ గౌడ్,ఉపాధ్యక్షులు అంజయ్య యాదవ్,కోశాధికారి రవీందర్,కార్యనిర్వహణ కార్యదర్శి అనిల్ కుమార్, గంగారపు వెంకటేష్ వెన్నెల శ్రీనివాస్,నాగేష్,,రాజన్న,మహేష్,వివేక్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: