మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
"దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని పీడించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు చరిత్రను మరచి ప్రజల్ని మభ్య పెట్టడానికి, వంచించడానికి యాత్రల పేరుతోటి ప్రజల్లోకి వస్తున్నారు.ఇది తెలంగాణ ప్రజలు ఎన్నటికీ స్వాగతించరు ప్రజల అనేక సమస్యల్ని పట్టించుకోకుండా అణిచి వేతనే ఆయుధంగా చేసుకొని అనేక ప్రజా ఉద్యమాల్ని నిరంకుశంగా అణచివేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసం మాత్రమే యాత్రలు చేపట్టింది తెలంగాణ రాకపూర్వం ఆ ఉద్యమాన్ని అనేక రకాలుగా అణచివేసిన ఇప్పటి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని చూసి తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యంగా భావించి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేస్తూ తద్వారా ప్రజల్ని నమ్మించి అక్రమంగా అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తున్నది దానిలో భాగంగానే రామగుండం నియోజకవర్గంలో సైతం తప్పుడు ప్రచారాలతో అబద్ధపు ఆరోపణలతో స్థానిక శాసనసభ్యులు కోరుకంటి.చందర్ ను నష్టపరచడానికి కాంగ్రెస్ నాయకులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తక్కువ చేసి చూపిస్తూ ప్రజల్ని గందరగోల పరుస్తున్నారు.గతంలో ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగకున్నా పట్టించుకోని మక్కాన్ సింగ్ ఈరోజు చందర్ ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంటే వాటి ద్వారా ప్రజలకు జరుగుతున్నటువంటి మేలును తట్టుకోలేక అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు దీన్ని ప్రజలు నమ్మబోరని తెలియజేస్తున్నాం అసాధ్యం అనుకున్న మెడికల్ కాలేజీని సాధించిన చందర్ ను ప్రజల నుండి వేరు చేసే కుట్రను తిప్పి కొట్టాలని ప్రజల్ని కోరుతున్నాం."గతంలో ఈ ప్రాంతాల నుంచి ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధుల హాయంలో అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి రామగుండం ఏరియాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనేక రకాలైనటువంటి పథకాలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న చందర్ ను విమర్శిస్తే ఊరుకునే సమస్య లేదు. గతంలో సెటిల్మెంట్లు గుండాయిజం ద్వారా ఈ ప్రాంత ప్రజల్ని పీడించిన చరిత్రను రామగుండం నియోజకవర్గ ప్రజలకు చాలా వివరంగా తెలియజేసే కార్యక్రమం తీసుకుంటామని తెలియజేస్తున్నాం తమ చైతన్యంతో ఈ ప్రాంతంలో గుండాయిజానికి ఘోరీ కట్టిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది తిరిగి అధికారంలోకి రావడం ద్వారా ఈ ప్రాంతంలో గుండాయిజాన్ని పున ప్రతిష్ట చేయాలని ప్రయత్నిస్తున్న వారి యొక్క చర్యలను కట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం."గతంలో ఓసిపి త్రీ ద్వారా మరియు గ్లోబల్ కోల్ వాషరీ ద్వారా విటల్ నగర్, తిలక్ నగర్, జవహర్ నగర్, రమేష్ నగర్, హనుమాన్ నగర్ లాంటి ప్రాంతాలు నిత్యం దుమ్ముతో ధూళితో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసినప్పుడు ఏమీ మాట్లాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఓసిపి-5 పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టే చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఓసిపి 5 ద్వారా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కోరుకంటి చందర్ ప్రయత్నం చేస్తుంటే దానికి సహకరించకుండా ప్రజలకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకుల చర్యలను ఖండిస్తున్నాం.ఏనాడు ప్రజల మేలుకొరకు పని చేయని మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఈరోజు కేవలం అధికారం కోసం చేపట్టిన యాత్రలను రామగుండం ప్రజలు నమ్మరు అనే విషయాన్ని వారు గుర్తిస్తే మంచిది. సింగరేణి కార్మికుని బిడ్డగా సింగరేణి కార్మికుల మరియు ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడే స్థానిక ఎమ్మెల్యే చందర్ ను ప్రజలు నిత్యం అభిమానిస్తూనే ఉంటారని తెలియజేస్తున్నాం యాత్రల పేరుతో ప్రజల మీద దండయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ప్రజల్ని బాధించే యాత్రలను నిలిపివేయాలని కోరుతున్నాం

Post A Comment: