మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన శ్రీరామ విద్యానికేతన్ స్కూల్ కు చెందిన 15మంది విద్యార్థులు ఈ నెల ఫిబ్రవరి 3 నుండి 7వ తేది వరకు హైదరాబాద్ లోని జీడిమెట్ల లో జరిగిన తృతీయ సోపాన్ గైడ్ అవార్డు టెస్టింగ్ క్యాంపు లో పాల్గొన్నారు.ఈ క్యాంపు లో జరిగిన ప్రధమ చికిత్స, టెంట్ కట్టడం,కుకింగ్, ముడులు వేయడం, కంపాస్, మాపింగ్, నేచర్ స్టడీ వంటి 45 అంశాల్లో విశేష ప్రతిభ కనబర్చి టెస్ట్ లో పాల్గొని పూర్తి చేశారు.ఈ సందర్బంగా శ్రీరామ విద్యానికేతన్ స్కూల్ లో జరిగిన కార్యక్రమం లోవిద్యార్థులను స్కౌట్ గైడ్స్ స్టేట్ ఆర్గనైసింగ్ సెక్రటరీ అనంత లక్ష్మి, స్కూల్ కరస్పాండెంట్ ఎస్ వెంకటేశ్వర్ రావు ,పెద్దపల్లి జిల్లా సెక్రటరీ సూర్యదేవర జ్యోతి, గైడర్ విజయ అభినందించారు.ఈ కార్యక్రమం లో స్కూల్ విద్యార్థులు గుండారపు అమృత వర్షిని, అశ్విజ , సాత్విక, శ్రీవిద్య ,వర్ష ,దీపిక, అఖిల, బర్ష, స్ఫూర్తి, లాస్య, వైష్ణవి, అన్విత, పూజిత, అర్ఫత్, విద్య లక్ష్మి.ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Post A Comment: