మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణి ఓసిపి ఫోర్ ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామం మేడిపల్లి గ్రామ అభివృద్ధికి సింగరేణి సి ఎస్ఆర్ నిధులు కేటాయించాలని కోరుతూ మూడవ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ సింగరేణి ఆర్జీవన్ జిఎం కల్వల నారాయణ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ గతంలో సింగరేణి సిఎస్ఆర్ 35 లక్షలు నిధులు మంజూరు చేసినందుకు జిఎం కలవల నారాయణను శాలువతో సన్మానం చేసినారు. మేడిపల్లి గ్రామ అభివృద్ధికి మరిన్ని సిఎస్ఆర్ నిధులు కేటాయించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా జిఎం కల్వల నారాయణ మాట్లాడుతూ మేడిపల్లి గ్రామ అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు కేటాయిస్తామని జీఎం కలవల నారాయణ హామీ ఇవ్వడం జరిగింది.

Post A Comment: