మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఏఐసిసి మరియు టిపిసిసి పిలుపు మేరకు, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం నియోజకవర్గం గోదావరిఖని 28, 30 డివిజన్ లో *హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటి ఇంటికి తిరిగి BJP, BRS ప్రభుత్వాల ద్వందనీతిని, అధికారం కోసం మోసపూరిత హామీలతో ప్రజలకు జరిగిన అన్యాయం గురించి వివరించి, *కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్దిని*తెలియజేశారు. అలాగే రైతుల కోసం రూపొందించిన *వరంగల్ రైతు డిక్లరేషన్*గురించి తెలిపి, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. ఒసిపి 5తో ఈ ప్రాంతాన్ని బొందల గడ్డగా మారుస్తున్నారని ఆరోపించారు, ఈ ప్రాంతంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ ఎఫ్ సి ఎల్ సంస్థలు ఉన్న కూడా స్థానిక యువతకు ఉద్యోగాలు లేక డబ్బులు పెట్టి మోసపోతున్నారని అన్నారు. మాయమాటలు తో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరవ మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ వారి సతీమణి మనాలి ఠాకూర్ వీరి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మరియు కార్పొరేటర్లు గాధం విజయనంద్ పెద్దేలి తేజస్వి ప్రకాష్ గారు md ముస్తఫా మల్ రెడ్డి సీనియర్ నాయకులతో పాటు యువ నాయకులు నాజిమ్, కౌటాం సతీష్, శంకర్,చాంద్ పాషా, నంది వెంకటేష్ (డి. ప్రెసిడెంట్ ) రంజిత్ (డి. ప్రెసిడెంట్ )ఆఫ్జాల్ (డి.ప్రెసిడెంట్ )పల్లికొండ రాజేష్,ప్రధాన సభ్యులు సోషల్ మీడియా కోర్డినేటర్ సతీష్ దూళికట్ట మరియు ప్రధాన మహిళా నాయకులతో పాటు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: