ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
మైనారిటీ కార్పొరేషన్ రుణాలు పొందేందుకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి అదనంగా 500 యూనిట్లు కేటాయించాలని కోరుతూ నేడు ప్రభుత్వ చీఫ్ విఫ్, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ కు వినతిపత్రం సమర్పించారు.
పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీల సంఖ్య అధికంగా ఉన్నందువలన అదనపు యూనిట్లను కేటాయించి వారి అభివృద్ధికి దోహదపడాలని ఆయన మంత్రి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కలెక్టర్ ద్వారా సిఫారసు చేయబడి పెండింగ్ లో ఉన్నటువంటి 350 దరఖాస్తులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని మంత్రి కోరారు, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయబడుతున్న రుణాల ద్వారా మైనార్టీలకు స్వయం ఉపాధి లభిస్తుందని తద్వారా మైనార్టీలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే మైనారిటీలకు సరైన న్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ విభాగం అధ్యక్షులు ఎండీ.నయిమోద్దీన్ పాల్గొన్నారు.

Post A Comment: