కాటారం మండలం చిద్నేపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేని దుస్థితి పిల్లలకు మరుగుదొడ్లు లేక బయట మలవిసర్జనకు వెళ్ళగా తేలు కుట్టిన పట్టించుకోని అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులు మండల విద్యాధికారికి తెలిపిన పట్టించుకోని మండల విద్యాధికారి, బడి పిల్లలు,ఇబ్బందులకు గురవుతున్న కూడా జిల్లా విద్యాశాఖ అధికారి మాత్రం అటువైపు చూడని దుస్థితి ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల కోసం ఎన్నో కొత్త పథకాలతో మెరుగుదిద్దుతుంటే ఆ జిల్లా శాఖ మాత్రం తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం చేస్తున్నారు. అక్కడి స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు,ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడికి కనీస అవసరాలు లేకుంటే పిల్లలను ఎలా బడికి పంపాలని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మరుగుదొడ్లు లేక విద్యార్థులు ప్రాణాలకు గురవుతున్నారు,ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చిద్నేపల్లి, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, అభివృద్ధి చేయాలని అక్కడి, ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు, కోరుతున్నారు.
మేడిగడ్డ టీవీ న్యూస్ హనుమకొండ ప్రతినిధి,
ఆత్మకూరు నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయ అధికారులు డా. పోల శ్రీనివాస్, సహాయ సంచాలకులు, డా. నాగమణి, సహాయ సంచాలకులు, పశు రోగ నిర్ధారణ విభాగం, డా. ధర్మా నాయక్, మండల పశు వైద్యాధికారి- ఆత్మకూరు, డా. వినయ్, వి ఏ ఎస్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, నిర్మలా, మరియు పాఠశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పెంపుడు జంతువుల పట్ల పెంపకం పై అవగాహన కల్పించడం జరిగింది మరియు వాటి ద్వారా ప్రజలకు సంక్రమించే వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే పెంపకం దారులు కూడా విధిగా వాటి సంరక్షణ పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు మరియు జంతు సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి అని సూచించారు. అనంతర జంతు సంరక్షణ చట్టాలపై అవగాహన అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది,మేడిగడ్డ, న్యూస్ హనుమకొండ,ప్రతినిధి
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, విభాగ వ్యవస్థ ప్రముఖ్ ఎలేటి నాగరాజు, విభాగ్ సంఘటన కార్యదర్శి కుంట హర్షవర్ధన్, ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ సుంకరి జ్యోతి, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఆరేపెల్లి సుజిత్, మరియు కొత్తపల్లి సుధాకర్, ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ మరియు జ్యోతి ప్రజ్వలన అనంతరం రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ దేశంలో యువత రోజు రోజుకు మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు బానిసై ఏంతో మంది విద్యార్ధులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. విద్యార్ధులు సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర సమరయోధులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని యువతకు సూచించారు. నేతాజీ కి జయంతి ఏ కానీ వర్ధంతి లేని ఏకైక స్వాతంత్ర సమరయోధుడు అని విద్యార్థులతో అన్నారు, స్వామి వివేకానంద ప్రపంచ దేశాలకు హిందుత్వాన్ని, భరత దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. భారత సంస్కృతినీ ప్రపంచ దేశాలకు చెరవేసిన మొట్ట మొదటి వ్యక్తి స్వామీ వివేకానంద. వీరిద్దరి అడుగు జాడల్లో ప్రతినిత్యం ఏబీవీపీ నడుస్తుంది అని అన్నారు, ఒక అప్పటి కాలంలో దేశానికి సైనిక దళాన్ని, దేశభక్తులను,స్వాతంత్ర సమరయోధులను అందించినటువంటి పంజాబ్ రాష్ట్రం నేడు మత్తు పదార్థాలకు, వ్యసనాలకు అలవాటు పడి పంజాబ్ రాష్ట్రం నాశనం అవుతుంది అని మాట్లాడారు, భగత్ సింగ్, రాజ్ గురు , సుక్దేవ్ లాంటి మహా వీరులు పుట్టిన ఈ నెలలో నా దేశ యువత నేడు మత్తుపదర్థలకు అలవాటు పడి చెడిపోతున్నారు అని అన్నారు. రాష్ట్రంలో విచ్చల విడిగా డ్రగ్స్ రాకెట్ దందాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి అని, ప్రభుత్వాలు కట్టడి చేసిన బయటి రాష్ట్రాల్లో నుండి అక్రమ రవాణా జరుగుతుంది అని దీనికి ఆనకట్ట వేయాలంటే కేవలం దేశ యువత తోనే సాధ్యం అవుతుంది అని మాట్లాడారు. దేశంలో క్రీడారంగంలో యువకులను రాణించాలని, వారి ప్రతిభను కలశాల క్యాంపస్ నుండి దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా విద్యార్ధులు తయారు చేసే కేంద్రంగా భరత్ ముందుకు వెళుతుంది అని అన్నారు. ఖేలో భారత్ అనేది దేశంలోనీ ప్రతీ కలశాల, పాఠశాల క్యాంపస్ లలో ఏబీవీపీ నిర్వహిస్తుందని నషా విముక్త్ భారత్ ను తయారు చేయడమే ఏబీవీపీ ఏకైక లక్ష్యమని తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ కన్వీనర్ హరిచరణ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రవణ్ భరత్ , సర్దార్ , రాహుల్, సలీం , క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు మండలంలో అంగన్వాడీల పనితీరు శూన్యం ప్రశ్నిస్తే కేసులు? ఇది అంగన్వాడీ సెంటర్ ఇష్టారాజ్యం, నెలలో 20 రోజులు పని దినాలు చేసిన పాపాన పోలేదు అయినా వారి వెంట మండల స్థాయి అధికారి, ఉన్నారని వారి ధీమా, హాజరు పట్టికలో వారి ఇష్ట రాజ్యంగా హాజరు వేసుకుంటారు, పై అధికారులు పట్టించుకోకుండా తమాషా చూస్తూ వదిలేస్తున్నారు, ఇది ఆత్మకూరు మండలంలో అంగన్వాడి ఒక్క సెంటర్ లో జరుగుతున్న తీరు, పిల్లలతో పని లేదు వారికి నెల వచ్చేసరికి జీతం వస్తే చాలు, ఇది ఆత్మకూరు మండలంలో అంగన్వాడి ఒక్క సెంటర్ లో ఉద్యోగుల పరిస్థితి, అంగన్వాడీలో పేరుకు కింది స్థాయి అయినా పెత్తనం మాత్రం మండల స్థాయి ఇప్పటికైనా తనిఖీ చేసి నిజానిజాలు తెలుసుకొని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు,
పెద్దపల్లి,గోదావరిఖని,జనవరి,26(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ),ముస్త్యాల ప్రభుత్వపాఠశాలలో76 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీపాదరావు స్మారాకార్డం ఆదివారం పెద్దపల్లి జిల్లా,రామగిరి మండలం,ముస్త్యాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు అందజేసిన రామగుండం ఏసిపి జాని నరసింహులు,ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు.పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ యూత్ ప్రధాన కార్యదర్శి సుందిల్ల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు బహుమతులు(టిఫిన్ బాక్సులు)అందజేసిన రామగుండం ఏసీపీ జాని నరసింహులు,అనంతరం వారు మాట్లాడారు,నేను ఒక పేద మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చానని పట్టుదలతో చదువుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నేనే ఒక ఉదాహరణ అంటూ ఏసీపీ చెప్పారు,ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు,విద్య బోధకులు(టీచర్స్) ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి దోహదపడాలని,తల్లిదండ్రులు కూడా మంచి మార్గంలో నడిపించాలని.కుటుంబానికి,గురువులకు,దేశానికి మంచి పేరు తీసుకురావాలని,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్రాసిన ఒక గొప్ప రాజ్యాంగం ద్వారా కులమత భేదాలకు అతీతంగా విద్య,వైద్యం,ఉద్యోగాలు,ఓటు హక్కు,ప్రతిదీ మనం పొందుతున్నామంటే అది మహనీయుల త్యాగమని,ప్రతి ఒక్కరు గుర్తుంచు కోవాలన్నారు.ఈ కార్యక్రమం నిర్వహించిన సుందిళ్ల సురేష్ ను అభినందించిన ఏసీపీ.ఈ కార్యక్రమంలో రామగిరి మండల కన్వీనర్ మహేశ్వర రావు,కాంగ్రెస్ పార్టీ నాయకులు జనగాం బుచ్చిబాబు,పాపిరెడ్డి,మల్లారెడ్డి విజేందర్ రెడ్డి,యాదగిరి,సుందిళ్ల కృష్ణ,గుర్రం నరేష్,కుమార్,సుంకరి పోతరాజు,గట్టయ్య,ముస్కుల నరేందర్ రెడ్డి,గర్రెపల్లి ప్రవీణ్ గౌడ్,కోరుకోప్పుల సత్యం గౌడ్,మణికంఠ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
BREAKING NEWS :
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పండుగ కావడంతో హైదరాబాద్ నుండి కారుతో కాగజ్ నగర్ కు మెకానికల్ ఇంజనీర్ అక్కు రాజు అతని భార్య బయలుదేరగా మధ్యలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. కారును లారీ ఢీ కొట్టింది. దీంతో సంఘటన స్థలంలో కారు భాగాలు ముక్కలు ముక్కలు పడిపోయాయి. ఈ రోడ్డు ప్రమాదంలో రాజుకు తీవ్ర గాయాలు కాగా అతని భార్య మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
BREAKING NEWS:-
బెంగుళూరులో దారుణం జరిగింది. 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాలుతో తొక్కి చంపాడు ఓ కామాంధుడు. సమాచారం అందుకున్న పోలీసులు అతని అరెస్టు చేసి హుటా హుటిన పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం. నిందితుడు బీహార కు చెందిన రోజు కూలీగా పని చేస్తున్నట్టు తెలుస్తుంది. భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ. తనతో కలిసి పని చేస్తున్న కూతురిపై తల్లిదండ్రులు లేని సమయం చూసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు తండ్రి కుమారుడు మృతి చెందారు. తండ్రి సతీష్ అతని 11 నెల కుమారుడు సాత్విక్ మరణించారు. హైదరాబాద్ నుండి గోదావరిఖనికి ప్రయాణిస్తూ వస్తుండగా మధ్యలో గాంధీనగర్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురిని గాయపడిన కుటుంబ సభ్యులను మెరిగైన చికిత్స కోసం హుట హుటిన ఆసుపత్రి కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు..
BREAKING NEWS :
మంత్రి పొంగులేటికి తృటిలో తప్పిన ప్రమాదం తప్పింది. పొంగులేటి ప్రయాణిస్తున్న ఎస్కార్ట్ కారు యొక్క రెండు టైర్లు ఒకేసారి పగలడంతో అదుపు తప్పింది. డ్రైవర్ చాకచక్యంతో వాహనాన్ని నడపడంతో ఎటువంటి ముప్పు జరగలేదు.ఖమ్మం తిరుమలాయపాలెం వద్ద ఈ సంఘటన జరిగింది. కారు లో వారితో పాటు మరో MLA వెంకట్రావు, DCCB డైరెక్టర్ రాజశేఖర్ మరియు తుళ్ళూరు బ్రహ్మయ్యా కూడా వాహనంలోనే ఉన్నారుBREAKING NEWS :
హన్మకొండ, న్యూస్టుడే:
మనిషికి గుండెపోట్లు ఎప్పుడు, ఎక్కడ ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు.వయసు తో సంబంధం లేకుండా ఈ మధ్యల గుండెపోట్లు వస్తున్నాయి. ఉన్నచోటనే ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. తాజాగా ఈరోజు హనుమకొండ జిల్లా గోపాల్ పూర్ లో గీత కార్మికుడు కల్లు గీయడానికి చెట్టు పైకి ఎక్కినాడు.ఆ తాటిచెట్టుపైనే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. పరిమళ కాలనిలో బైరగోని యాదగిరి గౌడ్ తాటిచెట్టు ఎక్కి కళ్ళు గీస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. తాటిచెట్టు పై నుంచి కిందకు వేలాడుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెట్టు పైనే మృతి చెందిన యాదగిరిని కిందకు దించారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యూపీ లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో కూలిన భవనం రెండవ అంతస్తు పైకప్పు, శిథిలాల కింద 23 మంది కూలీలు!..
ఉత్తర ప్రదేశ్‌లో ఈనాడు అనుకోకుండా ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం యొక్క రెండవ అంతస్తు పైకప్పు క్షణాలలో నిర్మాణ పనులు జరుగుతుండగానే కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో అనేక మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయినారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగి పలుసహాయక చర్యలు చేపట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా శిథిలాల కింద ఉన్న కూలీలను క్షేమంగా బయటకు తీసుకు వచ్చారు. మొత్తంగా 23 మంది కూలీలను బయటకు తీసుకురాగా.. 20 మందికి స్వల్ప గాయాలు కాగా,మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలియజేశారు. ప్రస్తుతం దీనిలో పనిచేసే కూలీలను స్థానికంగా ఉన్న దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
- BREAKING NEWS
సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది... మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఏడుగురు గల్లంతుకాగ.. వారిలో ఐదుగురి ప్రాణాలు పోయాయి.. ఇద్దరిని స్థానికులు కాపాడారు.. చనిపోయిన వారంతా 20 ఇళ్లలోపు వారే ఉన్న యువకులే.. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఈ యువకులు ఈ రోజు కొండపోచమ్మ సాగర్ డ్యాం వద్దకు వెళ్లారు. ఈత కొట్టెందుకు డ్యామ్ లో దిగి.. అంతా మునిగిపోయారు.. ఏడుగురు యువకులు కూడా గల్లంతు కాగా,వారిలో ఐదుగురు నీట మునిగి చనిపోతే, ఇద్దరిని.. స్థానికులు కాపాడారు.
చనిపోయినవారిలో ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ధనుష్ (20 సం||), లోహిత్(17 సం||), చీకట్ల దినేశ్వెర్ (17సం||), సాహిల్ (19సం||), జతిన్ (17సం||) గా గుర్తించారు.. కోమరి మృగంక్, ఎండి ఇబ్రహీం ఇద్దరూ బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఫోన్లో సెల్ఫీ కోసం డ్యామ్‌లోకి యువకులంతా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఏడుగురు డ్యామ్‌లోకి దిగారని పేర్కొంటున్నారు.ఐదుగురు నీటిలో మునిగితే, వీరిలో ఇద్దరు మాత్రమే బయటపడ్డారని స్థానికులు తెలియజేశారు.
తెలంగాణ ప్రభుత్వం పేదలకు శుభ వార్తను అందించింది.తెలంగాణలో మరో 30 లక్షల మందికి త్వరలో రేషన్ లబ్ధి కలిగే అవకాశం ఉన్నట్లు అధికార ప్రతినిధి వర్గాలు తెలియజేశాయి.ఇటీవల చేసిన సామాజిక, ఆర్థిక సర్వే డేటా ఆధారంగానే.. నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని.. ఫౌరసరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. కొత్తగా జారీ చేయనున్న కార్డులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సంతకాలు ఉండనున్నాయి. ఈ జనవరి 26 నుంచి నూతన రేషన్ కార్డ్స్ ఇవ్వనున్నారు. గతంలో ఉన్న పాత రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించిన వివరాలను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.అలాగే ఈ నూతన రేషన్‌కార్డుకు సంబంధించిన డిజైన్ ప్రక్రియకు ఇంకొంత సమయం పట్టే అవకాశముందని పౌరసరఫరాల అధికారులు తెలిపారు.
టీమిండియా క్రికెట్ ప్లేయర్ జడేజా క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియా(ఇన్స్టాగ్రామ్)లో జడేజా చేసిన ఓ పోస్ట్ రిటైర్‌మెంట్ వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది. జడేజా రిటైర్‌మెంట్ ప్రకటించడం ఖాయంగానే కనిపిస్తోందని క్రికెట్ వర్గాలతో పాటు అభిమానులు చెబుతున్నారు. అయితే జడేజా ఇన్‌స్టాగ్రామ్‌లో తను వేసుకొనే జెర్సీ నంబర్ 8 ఫొటోను పోస్ట్ చేశాడు.ఫొటోకు ఎలాంటి క్యాప్షన్ అందించలేదు.ఒక జెర్సీ ఫొటోను మాత్రమే జడేజా షేర్ చేశాడు. జడేజా జెర్సీ ఫొటోతో రిటైర్‌మెంట్ పుకార్లు మొదలయ్యాయి."హ్యాపీ రిటైర్‌మెంట్ డే జడేజా" అంటూ అభిమానులు అప్పుడే జడేజాకు విషెస్ చెప్పడం స్టార్ట్ చేసారు.తన రిటైర్‌మెంట్ ప్రకటించాలనే ఆలోచనతోనే జడేజా జెర్సీ ఫొటోను షేర్ చేసినట్లు తెలుస్తోంది.
BREAKING NEWS
తెలంగాణ న్యూస్ టుడే: అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన తెలంగాణ లోని ఖమ్మం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో జరిగింది. స్థానికంగా లక్ష్మీదేవిపల్లి లోని ఓ మెస్లో వంట పనిచేస్తూ ఓ కుటుంబం బ్రతుకుతుంది. అక్కడే పనిచేస్తున్న మరో వ్యక్తి చాక్లెట్స్ ఇస్తానని చిన్నారిని నమ్మించి మెల్లగా గదిలోకి తీసుకెళ్లి కామవాంచతీర్చుకోవడానికి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి విపరీతంగా ఏడుస్తూ తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆ వ్యక్తికి చితకబాదారు. పోలీసులు కేసు నమోదు చేశామని తెలియజేశారు..
BREAKING NEWS
సంగారెడ్డి జిల్లా బుసారెడ్డిపల్లి గ్రామ శివారులోని హరిత రిసార్ట్ లో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.నిన్న సాయంత్రం హరిత రిసార్ట్ లో రూమ్ అద్దెకు తీసుకున్న తర్వాత రాత్రి ఏ సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియరాలేదు, ఈ ఇద్దరు ప్రేమికుల రూమ్ కి ఉదయం రూమ్ క్లినింగ్ సిబ్బంది వెళ్ళగా ఫ్యాన్ కి ఉరివేసుకుని విగత జీవులుగా ఉన్నారు.ఈ విషయాన్ని రిసార్ట్ యాజమాన్యం పోలీసులకు సమాచారంఅందించింది. మునిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్న వారు ప్రేమికులు ఉదయ్(26), మౌనిక (19)గా గుర్తించారు.వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడం తో ఇలా రిసార్ట్ లో ఆత్మహత్య చేసుకొన్నారని స్థానిక పోలీసులు తెలిపారు. ఇద్దరు ప్రేమికుల మరణంతో ఆ గ్రామంలో విషాదఛాయల అలుముకున్నాయి.
కర్ణాటక న్యూస్ టుడే : మనకేదైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం మన సమీపంలోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించి న్యాయం కోసం పోరాడుతాం అది ఆడవాళ్ళయినా, మగవాళ్ళు అయినా, అలాంటిది పోలీస్ స్టేషన్లోని ఓ పోలీస్ అధికారి అసభ్యకరంగా నీచంగా వ్యవహరిస్తే ఇక మనమేం చేయాలి, ఈ ఘటన కర్ణాటకలోని మధుగిరి పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ పట్ల పోలీస్ అధికారి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను తన గదిలోకి తీసుకెళ్లి నీచంగా మాట్లాడాడు.ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నంత అధికారులు దర్యాప్తు చేసి ఈ పోలీస్ స్టేషన్ అధికారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.