మేడిగడ్డ టీవీ న్యూస్ హనుమకొండ ప్రతినిధి,
ఆత్మకూరు నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయ అధికారులు డా. పోల శ్రీనివాస్, సహాయ సంచాలకులు, డా. నాగమణి, సహాయ సంచాలకులు, పశు రోగ నిర్ధారణ విభాగం, డా. ధర్మా నాయక్, మండల పశు వైద్యాధికారి- ఆత్మకూరు, డా. వినయ్, వి ఏ ఎస్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, నిర్మలా, మరియు పాఠశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పెంపుడు జంతువుల పట్ల పెంపకం పై అవగాహన కల్పించడం జరిగింది మరియు వాటి ద్వారా ప్రజలకు సంక్రమించే వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే పెంపకం దారులు కూడా విధిగా వాటి సంరక్షణ పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు మరియు జంతు సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి అని సూచించారు. అనంతర జంతు సంరక్షణ చట్టాలపై అవగాహన అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది,
Post A Comment: