BREAKING NEWS :
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పండుగ కావడంతో హైదరాబాద్ నుండి కారుతో కాగజ్ నగర్ కు మెకానికల్ ఇంజనీర్ అక్కు రాజు అతని భార్య బయలుదేరగా మధ్యలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. కారును లారీ ఢీ కొట్టింది. దీంతో సంఘటన స్థలంలో కారు భాగాలు ముక్కలు ముక్కలు పడిపోయాయి. ఈ రోడ్డు ప్రమాదంలో రాజుకు తీవ్ర గాయాలు కాగా అతని భార్య మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Post A Comment: