December 2024
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

  

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉద్యోగులు చేపడుతున్న దీక్షకు తెలంగాణ టీడీపీ పార్టీ తరుపున మంథని నియోజకవర్గం ఇన్చార్జి మరియు జిల్లా సీనియర్ నాయకులు అందె • భాస్కరాచారి, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి జనార్ధన్,పరకాల నియోజకవర్గ ఇన్చార్జి కందుకూరి నరేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్ పి కె సాగర్, మహేందేర్ తదితరులు పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అందె భాస్కరాచారి మాట్లాడుతూ వారి సమస్యల పరిష్కారం లో టీడీపీ పార్టీ తరుపున తమ వంతు కృషి చేస్తాము అని హామీ ఇచ్చారు అలాగే భూపాలపల్లి సింగరేణి బొగ్గు కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది అంటే అది తెలుగుదేశం పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి కృషేనని భూపాలపల్లి జిల్లా అభివృద్ధి లో రాబోయే రోజుల్లో కూడా తెలుగు దేశం పార్టీ కీలక పాత్ర పోషించనుంది అని కొనియాడారు. ఈ వేదికగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు టీడీపీ పార్టీ అధికారం కట్టబెడుతారు, తెలుగు దేశం పార్టీ అనుక్షణం ప్రజల సమస్యల పై గళం విప్పుతూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుంది అన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలంలో ఒకప్పుడు ఫ్లోరైడ్‌వ ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు కొత్తగా డెంటల్‌ ఫ్లోరోసిస్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇది ఈ ప్రాంతంలో నీటి కలుషిత సమస్యలపై ఆందోళనలను రేకెత్తిస్తూ ఫ్లోరైడ్ సమస్యలో పునఃస్థితిని సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ కింద కుళాయిల ద్వారా తాగునీరందించడం ద్వారా ఫ్లోరోసిస్‌ సమస్య నుంచి విముక్తి కల్పించాలని తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పట్టం కట్టిన మూడేళ్లకే నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో తాజాగా డెంటల్ ఫ్లోరోసిస్ కేసులు నమోదయ్యాయి.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

న్యూఢిల్లీ: భారత దేశ మాజీ PM మన్మోహన్ సింగ్ మృతదేహాన్ని కాంగ్రెస్ హెడ్కోటర్స్ లో ఉంచారు. పార్థివ దేహం యొక్క అంతిమ యాత్ర ఈరోజు ఉదయం 9.30 గంటలకు AICC నుండి శ్మశాన వాటికకు ప్రారంభమైంది" అని ఆయన అంత్యక్రియలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు తెలిపారు. దేశం తన ప్రియమైన 14వ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపై ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్న వేళ, ఆయన అంతిమ వీడ్కోలు ఈరోజు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభం అవుతుంది. ఢిల్లీలోని నిగమ్బేధ్ ఘాట్లో ఉదయం 11:45కు అంత్యక్రియలు జరుగుతాయి. మన్మోహన్ సింగ్ కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ తదితరుల నివాళి అర్పించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
నేడు హైదరాబాదులో జరిగిన  HRO AI జాతీయ మరియు రాష్ట్ర నాయకుల సమావేశ సందర్భంగా శ్రీ గుండాల సునీల్ చంద్ర గారికి HROAI రాష్ట్ర కమిటీ జాయింట్ సెక్రెటరీ బాధ్యతలను HROAI ఫౌండర్ అండ్ డైరెక్టర్ జాతీయ అధ్యక్షులు శ్రీ అయ్యప్ప అరుణాచల అడ్వకేట్ గార్లు అప్పగించి శాలువాతో ఘనంగా సత్కరించారు .. ఈ సందర్భంగా జాతీయ వైస్ ప్రెసిడెంట్  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోమిన్ భాష గారు  బాధ్యతలు గుర్తు చేస్తూ చురుగ్గా పని చేయాలని సూచించారు... ఈ కార్యక్రమంలో HROAI చైర్మన్ రాజా చిరంజీవి అడ్వకేట్ సౌత్ ఇండియా చైర్మన్ P ధనలక్ష్మి , తెలంగాణ చైర్మన్ KL నారాయణరెడ్డి, రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ M వెంకట్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఉమెన్ ఉమెన్ వింగ్ జాయింట్ సెక్రెటరీ Y కరుణశ్రీ,  రంగారెడ్డి జిల్లా ఉమెన్ వింగ్ జాయింట్  సెక్రెటరీT లక్ష్మీ గార్లు హాజరు అయ్యారు... ఈ బాధ్యతలు అప్పగించినందుకు గర్వంగా ఉంది అంటూ వ్యవస్థ కోసం కష్టపడుతాను అని నూతనంగా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ HROAI రాష్ట్ర  జాయింట్ సెక్రెటరీ గుండాల సునిల్ చంద్ర తెలియజేశారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

గ్రూప్ -2 పరీక్షల నిర్వహణ విధులకు కేటాయించిన అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి అన్నారు.గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఈ నెల 15,16 తేదీల్లో జరగనున్న గ్రూప్ -2 పరీక్షల నిర్వహణపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రూప్ -2 పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల హాల్ టికెట్, ఫోటో గుర్తింపును క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద నిర్వర్తించాల్సిన విధుల సంబంధించి నియమ నిబంధనలు , మార్గదర్శకాలను అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవి, పరీక్షల రీజినల్ కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ సదానందం, ప్రొఫెసర్ ఆనంద్ కిషోర్, కలెక్టరేట్ ఏవో గౌరీ శంకర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హన్మకొండ ;

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్‌ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోపు తెలియజేయాలని  అదనపు కలెక్టర్‌ వెంకటరెడ్డి రాజకీయ పార్టీలను కోరారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో  గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్‌ సమావేశం అయ్యారు.  ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్‌ పర్యవేక్షణలో ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ నెల 7 వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామని గుర్తు చేశారు. జిల్లాలో మొత్తం 210 గ్రామ పంచాయతీలు, 1986 వార్డులు ఉండగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను అనుసరిస్తూ 1986 పోలింగ్‌ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని వివరించారు. ఈ ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 12 వ తేదీలోపు తెలుపవచ్చని, 12న అన్ని మండలాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలు నిర్వహించే సమావేశంలోనూ అభ్యంతరాలు స్వీకరిస్తారని అదనపు కలెక్టర్‌ తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను 13వ తేదీన పరిష్కరించడం జరుగుతుందని, జిల్లా పాలనాధికారి ఆమోదం అనంతరం ఈ నెల 17న అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో తుది పోలింగ్‌ కేంద్రాల జాబితా ప్రకటించబడుతుందని అన్నారు.ఈ సమావేశంలో డీపీఓ లక్ష్మి రమాకాంత్‌, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్‌  నుండి ఇ. వి. శ్రీనివాస్ రావు, నేహాల్, బి.జె.పి. నిశాంత్‌, ఎం.ఐ.ఎం. ఫైజుల్లా , వైఎస్‌ఆర్‌ సిపి. రజినీకాంత్‌, టి.డి.పి కుసుమ శ్యామ్‌ సుందర్ సి.పి.ఎం. వెంకట్‌  రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హన్మకొండ ;

నూతనంగా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన పిసీలు అంకితభావంతో, నిజాయితీగా విధులు నిర్వర్తించి ప్రజలకు సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 9 నెలల బేసిక్ శిక్షణను పూర్తిచేసుకుని జిల్లాకు వచ్చిన పోలీసు కానిస్టేబుల్లతో ఎస్పి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ

పోలీస్ ఉద్యోగం అనేది నిత్యం ఒత్తిడి తో కూడుకున్న ప్రొఫెషన్ అని, ప్రతికూల పరిస్థితులలో కూడా ఉద్యోగం చేయవలసి ఉంటుందని అన్నారు. జిల్లా నుండి పోలీస్ శాఖకు మొత్తం 52 మంది అభ్యర్థులు ఎపికయ్యారని, 6 మంది సివిల్, 46 మంది సాయుధ దళ (AR) కానిస్టేబుళ్లు ఉన్నారన్నారు. పోలీసు శాఖ ప్రధానంగా ప్రజల రక్షణ కోసం పనిచేస్తుందని, పౌరుల హక్కులు, ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ప్రజలతో మంచి నడవడికను అలవాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగంలో క్రమశిక్షణ అనేది చాల ముఖ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అలాగే

శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కోరారు. నేరాల నియంత్రణ , కొత్త టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులకు దేశంలో గుర్తింపు ఉన్నదని, యూనిఫాంలో నూతన కానిస్టేబుళ్లు చేసే పనులను ప్రజలు గమనిస్తుంటారని, మంచి నడవడికతో పోలీసు ప్రతిష్టను పెంపోందించడానికి కృషి చేయాలని ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, నగేష్, రత్నం, కిరణ్, శ్రీకాంత్ నూతన కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హన్మకొండ ;

 హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో డీఆర్డీఏ, మహిళా స్యయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్  భవనాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య బుధవారం పరిశీలించారు. 

సహకార శాఖ కు సంబంధించిన భవన సముదాయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను నెలకొల్పేందుకు నిర్ణయించగా అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఆయా శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు కు అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో డీఆర్డీవో మేన శ్రీను, ఎంపీడీవో అనీల్ కుమార్, డీపీఎం జన్ను ప్రకాష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి

 ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.

బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ లోని శ్రీవినాయక రైస్ మిల్లు ను కలెక్టర్ పరీశీలించారు. 

ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా మిల్లుకు వచ్చిన సన్న, దొడ్డు రకాల ధాన్యం, పట్టిన బియ్యం,  ధాన్యం తరలింపు, తేమ శాతం, గన్నీ సంచులు, తదితర వివరాలను అధికారులు, నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు, మిల్లులకు తరలింపునకు సంబంధించిన అంశాలను గురించి అధికారులు, నిర్వాహకులకు కలెక్టర్ పలు సలహాలు, సూచనలు చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హన్మకొండ ;

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ, మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలను  జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి బుధవారం పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. అదేవిధంగా గూడూరు లోని  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  అదనపు కలెక్టర్  పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డాక్టర్ అప్పయ్య, స్థానిక తహసీల్దార్ సురేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హన్మకొండ ;

హనుమకొండ జిల్లాలోని దేవునూర్, ముప్పారం పరిధిలో నోటిఫై చేసిన ఫారెస్ట్ భూముల సర్వే ప్రక్రియను అధికారులు త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య రెవెన్యూ, అటవీ, ల్యాండ్ సర్వే అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు, ముప్పారం పరిధిలో నోటిఫై చేసిన ఫారెస్ట్ భూముల సర్వేను ఆయా శాఖల అధికారులు చేపట్టిన సర్వే ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నోటిఫై చేసిన ఫారెస్ట్ భూముల పరిధిలో ఎంత మంది రైతులు ఉన్నారు, ఎంత విస్తీర్ణం సాగవుతున్న వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సాగులో ఉన్న పలువురు రైతులు అక్కడికి రాగా కలెక్టర్ వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ సర్వేకు రైతులు సహకరించాలన్నారు. భూముల విషయంలో రైతులకు న్యాయం జరిగేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫారెస్ట్ భూములు, రెవెన్యూ భూములు గుర్తించేందుకు చేపట్టిన సర్వేను ఆయా శాఖల అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, స్థానిక తహసీల్దార్ సదానందం, ఫారెస్ట్, సర్వే అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -4 పరీక్షలో ఎంపికైన జిల్లాకు చెందిన 208 మంది అభ్యర్థులు పెద్దపల్లి లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకునేందుకు బుధవారం తరలి వెళ్లారు. 208 మంది అభ్యర్థులకు అనుమకొండ కలెక్టరేట్ ఎదుట ఐదు బస్సులు ఏర్పాటు చేయగా అభ్యర్థులు వెళ్లే బస్సులను జిల్లా అదరపు కలెక్టర్ వెంకట్ రెడ్డి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హన్మకొండ ;

 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను  జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో చేపట్టిన  తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, ఇతర మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని  కలెక్టర్ పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి  విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో వాసంతి, డిఆర్డివో మేన శ్రీను, ఎంపీడీవో అనిల్ కుమార్, సంబంధిత శాఖల  అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హన్మకొండ ;

 బాలలు సోషల్ మీడియా కు ఎంతదూరంగా ఉంటే అంతమంచిదని, అందుకే సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. 

శనివారం హనుమకొండ లోని కాళోజీ కళాక్షేత్రంలో బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాస్థాయి బాలల దినోత్సవ వేడుకలను పిల్లలు, మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం బాలల హక్కుల థీమ్ “బాలల భవిష్యత్తు కొరకు బాలల హక్కుల కొరకై నిలబడదాం” అని తెలియజేస్తూ బాలలకు హెల్త్ అండ్ సేఫ్టీ గురించి, చైల్డ్ హెల్ప్ లైన్ -1098 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  బాలలందరూ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి  హాజరై మాట్లాడుతూ బాలల హక్కుల వారోత్సవాలలో నిర్వహించే పలు కార్యక్రమాలు బాలలకు వారి హక్కులపై అవగాహన కలిగిస్తాయని అన్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే సందర్భంగా బాలలకు శుభాకాంక్షలు తెలిపి హనుమకొండ జిల్లాలోని వివిధ సిసిఐ బాలలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

అలాగే గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి మాట్లాడుతూ బాలలలో ఉన్న ప్రతిభను వెలికితీస్తే అద్భుతాలు చేయగలరని తెలిపారు. 

కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన  గావించారు 

ఈ సందర్భంగా ప్రపంచ చెస్ ఛాంపియన్  షిప్ లో రెండవ స్థానం పొందిన అర్జున్ ను ఘనంగా సన్మానించారు.

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో  ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల కు చెక్కులను అందజేశారు

ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి జయంతి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఈసీ మెంబర్ ఇవి. శ్రీనివాస్,  కార్పొరేటర్ రావుల కోమల, ప్రాజెక్టు లెవెల్ సిడిపిఓలు స్వాతి, భాగ్యలక్ష్మి, సి డబ్ల్యూ సి మెంబర్స్, జిల్లా సంక్షేమాధికారి కార్యాలయ సిబ్బంది, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బాల సదనాల నిర్వాహకులు, చైల్డ్ లైన్, డిసిపియు సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, అంగన్ వాడి పిల్లలు, వివిధ పాఠశాలల నుండి 800 మంది చిన్నారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

 



హన్మకొండ ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే  ఆదేశాలతో  జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్  బ్యాంకుల్లో భద్రతపై  జిల్లా పోలీసులు తనిఖీ నిర్వహించారు. బ్యాంకుల్లో భద్రతా లోపాలు ఉండకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పీ అన్నారు. బ్యాంకుల్లో దొంగతనాల నివారణకు, ముందస్తు  భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా పరిధిలోని ఎస్సైలు, సిఐ  లు, డీఎస్పీలు ఏక కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో మరియు ఏటీఎం  ల వద్ద భద్రతా పరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే  ఘనపురం మండల కేంద్రంలోని  డిస్ట్రిక్ట్  కో ఆపరేటివ్ బ్యాంక్ లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ

సీసీ టీవీ కెమెరాలు జిల్లాలోని అన్ని బ్యాంకులు భద్రత ప్రయోజనాల కోసం  కలిగి ఉండాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న జాతీయ, ప్రైవేట్ బ్యాంకు శాఖలలో పోలీసులు జరిపిన తనిఖీల్లో గుర్తించన విషయాలపై  భద్రతాపరంగా తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకు  అధికారులకు సూచించారు. బ్యాంకు ఆవరణ అంతా కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్, సెక్యూరిటీ గార్డ్,  సీసీ కెమెరాలు, లైటింగ్,  బ్యాంకుల్లో భద్రత లోపాలు  ఉండకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని  అన్నారు. ఈ తనిఖిల్లో  భూపాలపల్లి, కాటా రం డీఎస్పీలు జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్సై  లు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 



హన్మకొండ ;

వరదలు వచ్చినప్పుడు గానీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ, ఎవరైనా నీటిలో మునిగినప్పుడు ఎలా కాపాడాల నే విషయంపై పౌరులందరికీ అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండలోని వడ్డేపల్లి చెరువు దగ్గర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పౌరులను ఎలా కాపాడాలనే విషయంపై ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం మాకు డ్రిల్ నిర్వహించింది.ఈ మాక్ డ్రిల్ లో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖ, మునిసిపల్ డి ఆర్ ఎఫ్ బృందాలు వారి శాఖల ద్వారా ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు సామాన్య ప్రజలను ఎలా కాపాడాలనే విషయంపై అందరికీ అవగాహన కల్పించాలని అన్నారు.విపత్తుల సంభవించినప్పుడు ప్రజలు తమంతట తామే రక్షించుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి అప్పయ్య,జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి, అగ్నిమాపక శాఖ అధికారి జయపాల్ రెడ్డి, జి డబ్ల్యూ ఎం సి మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హన్మకొండ ;

నోబెల్ పురస్కార గ్రహీత, ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని తేజస్వి పాఠశాలలో జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండలోని సైన్స్ సెంటర్ ను ఆధునికరించడానికి 10 కోట్ల రూపాయలు వ్యయంతో ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. త్వరలోనే వాటి పనులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతులమీదుగా ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయ ఆలోచనలతో విద్యార్థులు ముందుకు వెళ్లాలని సూచించారు.సైన్స్ లేకుండా జీవితం లేదన్నారు. సైన్స్ ఫెయిర్ లలో పాల్గొన్న ప్రదర్శనలన్నింటిని టీచర్లు రాసుకొని తమ తమ పాఠశాలలో విద్యార్థులకు వివరించాలన్నారు. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి సైన్స్ ఫెయిర్ దోహదపడుతుందన్నారు. ప్రపంచ స్థాయిలో దేశాల మధ్య ఆర్థిక పరమైన పోటీలకన్నా శాస్త, సాంకేతిక రంగాలలోనే అతి పెద్ద పోటీ నెలకొని ఉందన్నారు. వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అయిన ఏపీజే అబ్దుల్ కలాం ఆశించిన విధంగా విద్యార్థులు కలలు కనాలని, ఆ కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేయాలన్నారు. నిత్య జీవితంలో సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇన్స్పైర్ కు గాను కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం అభినందనీయం అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య మాట్లాడుతూ తమలోని సృజనాత్మక ఆలోచనలు, శాస్త్ర సాంకేతిక అంశాలను ప్రదర్శించేందుకు విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ అనేది గొప్ప అవకాశం అన్నారు. ప్రతి పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ప్రాక్టికల్స్ ఎక్కువగా చేస్తే విద్యార్థులకు ఆ సబ్జెక్టు అంతగా అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పీఎం శ్రీ పథకం కింద ల్యాబ్ లను అభివృద్ధి చేశామన్నారు. అంతేగాక స్మార్ట్ టీవీలను కూడా ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఎక్కువగా ఎక్స్పరిమెంట్ వీడియోలను చూపించాలని ఉపాధ్యాయులకు సూచించామని కలెక్టర్ తెలిపారు. హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి మాట్లాడుతూ జిల్లాలో ఒక లక్ష 20 వేల మందికిపైగా విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని, వీరందరికీ పాఠశాల దశ నుంచి సైన్స్ పట్ల అభిరుచి కలిగెలా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సైన్స్ ఫెయిర్ లో నాణ్యమైన ప్రదర్శనలు రావడానికి గాను సైన్స్ టీచర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనల ప్రదర్శనతో పాటు పేపర్ ప్రజెంటేషన్లు, సెమినార్లు, డిస్కషన్స్ లాంటివి కూడా నిర్వహిస్తున్నామన్నారు. గతంలో జాతీయ స్థాయి పోటీకి హనుమకొండ విద్యార్థులు ప్రదర్శనలు వెళ్లారని తెలిపారు.

ఈ ప్రదర్శనలో 120 ఇన్స్పైర్ ఎగ్జిబిట్లు, 106 జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రదర్శించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో హనుమకొండ మండల విద్యాశాఖ అధికారి విజయకుమార్, తేజస్వి పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హన్మకొండ ;

పోలీసులు ప్రజలకు మరింత చేరువ అయ్యేలా  విధులు నిర్వర్తించాలని  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే  పేర్కొన్నారు.  శుక్రవారం ఎస్పి  ఘనపురం  పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా  పెండింగ్ లో ఉన్న కేసులు, విధుల నిర్వహణ, పరిష్కారం, పోలీస్ స్టేషన్లోని  కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు నియంత్రణకు సంబంధించిన చర్యల గురించి ఎస్సై  అశోక్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ లోని పెండింగ్  కేసులు, రికార్డులు మరియు రికార్డ్ రూమ్, రైటర్ రూమ్, లాకప్ రూం వివిధ  విభాగాలను  క్షుణ్నంగా పరిశీలించారు. ఆ తర్వాత ఎస్పి  మాట్లాడుతూ  విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. దొంగతనాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్నారు.  సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మండలంలో  ఎక్కువ మొత్తంలో  సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలను చైతన్య పర్చాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పి కిరణ్ ఖరే ఆదేశించారు. అంతకు ముందు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా  ఘనపురం మండల కేంద్రంలోని డిసిసి బ్యాంక్ లో  భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, సీసీ కెమెరాల పనితీరు, బ్యాంకుకు సంబందించిన  భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, బ్యాంక్  అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు, చిట్యాల సీఐ మల్లేశ్ ఘనపురం ఎస్సై  ఆర్. అశోక్, సీసీ ఫసియుద్దిన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.