ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
గ్రూప్ -2 పరీక్షల నిర్వహణ విధులకు కేటాయించిన అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి అన్నారు.గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఈ నెల 15,16 తేదీల్లో జరగనున్న గ్రూప్ -2 పరీక్షల నిర్వహణపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రూప్ -2 పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల హాల్ టికెట్, ఫోటో గుర్తింపును క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద నిర్వర్తించాల్సిన విధుల సంబంధించి నియమ నిబంధనలు , మార్గదర్శకాలను అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవి, పరీక్షల రీజినల్ కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ సదానందం, ప్రొఫెసర్ ఆనంద్ కిషోర్, కలెక్టరేట్ ఏవో గౌరీ శంకర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: