భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉద్యోగులు చేపడుతున్న దీక్షకు తెలంగాణ టీడీపీ పార్టీ తరుపున మంథని నియోజకవర్గం ఇన్చార్జి మరియు జిల్లా సీనియర్ నాయకులు అందె • భాస్కరాచారి, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి జనార్ధన్,పరకాల నియోజకవర్గ ఇన్చార్జి కందుకూరి నరేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్ పి కె సాగర్, మహేందేర్ తదితరులు పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అందె భాస్కరాచారి మాట్లాడుతూ వారి సమస్యల పరిష్కారం లో టీడీపీ పార్టీ తరుపున తమ వంతు కృషి చేస్తాము అని హామీ ఇచ్చారు అలాగే భూపాలపల్లి సింగరేణి బొగ్గు కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది అంటే అది తెలుగుదేశం పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి కృషేనని భూపాలపల్లి జిల్లా అభివృద్ధి లో రాబోయే రోజుల్లో కూడా తెలుగు దేశం పార్టీ కీలక పాత్ర పోషించనుంది అని కొనియాడారు. ఈ వేదికగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు టీడీపీ పార్టీ అధికారం కట్టబెడుతారు, తెలుగు దేశం పార్టీ అనుక్షణం ప్రజల సమస్యల పై గళం విప్పుతూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుంది అన్నారు.
Post A Comment: